రానా ఆరోగ్యంపై వస్తున్న వార్తలకు చెక్ పెట్టాడు

గత కొద్దీ రోజులుగా భల్లాలదేవుడు కి ఆరోగ్య సమస్యలు అంటూ కొన్ని వార్తలు మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. రానా కి ఆరోగ్య సమస్యలు వలన విదేశాల్లో ట్రీట్మెంట్ తీసుకుంటున్నాడని… వస్తున్న వార్తలకు శ్రీ రెడ్డి వంటి వాళ్ళు రానా త్వరగా కోలుకోవాలని ట్వీట్స్ పెట్టడం.. ఫైనల్ గా ప్రేక్షకులు కూడా రానా నిజంగానే ఏదో ఆరోగ్యపరమైన సమస్యతో బాధపడుతున్నాడు అని ఫిక్స్ అవుతున్నారు. ఇక ఆ వార్తలు సోషల్ మీడియా అంతటా వైరల్ అయ్యాయి. అయితే రానాకీ ఎప్పటినుండో ఒక కంటికి సమస్య ఉంది. ఆ సమస్యకు పరిష్కారం విదేశాల్లో ఉంది. అంటే ఆ కన్నుకి ఆపరేషన్ విదేశాల్లో జరగాల్సి ఉంది. అయితే ఆ కన్ను సమస్య కాకుండా రానా మరేదన్న ఆరోగ్య సమస్యతో బాధపడుతున్నాడా అనే ప్రచారం జరుగుతన్న వేళ… తన ఆరోగ్య సమస్యపై వస్తున్న రూమర్స్ పై రానా మొదటిసారి స్పందించాడు.

రానా తన ట్విట్టర్ లో.. తనకి బిపి అంటే బ్లడ్ ప్రెషర్ ఉందని…. అది కంట్రోల్ కావడానికి ట్రీట్మెంట్ తీసుకుంటున్నానని చెప్పిన రానా… ఈ కారణంగానే తన కన్ను ఆపరేషన్ ఆలస్యమైందని క్లారిటీ ఇచ్చాడు. ఇంతకూ మించి తన ఆరోగ్యానికి మరే రకమైన ఆరోగ్య సమస్యలూ లేవు. అలాగే నేను చాలా బాగున్నాను అంటూ తన ఆరోగ్యంపై వస్తున్న వదంతులకు ఫుల్ స్టాప్ పెట్టాడు. ఇక తనకు వచ్చిన బిపి, అలాగే కంటి సమస్య కొడాఆ త్వరలోనే సెట్ అయ్యి కోలుకుంటానని చెప్పిన రానా నా ఆరోగ్యం నాది.. మీది కాదు.. అంటూనే తన మీద చూపిస్తున్న ప్రేమకు కృతజ్ఞతా చెబుతూనే… ఇలాంటి రూమర్స్ ని ప్రచారం చెయ్యవద్దని కోరాడు.