కిడ్నీ మార్పిడి కోసం రానా విదేశాలకి ?

సక్సెస్ ఫుల్ డైరెక్టర్ క్రిష్ దర్శకత్వంలో ‘ఎన్టీఆర్’ బయోపిక్ సినిమా షూటింగ్ శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. ప్రస్తుతం ఆంధ్ర ప్రదేశ్ సీఎం నారా చంద్రబాబు నాయుడు పాత్రకు సంబంధించి కొన్ని సన్నివేశాల్ని చిత్రీకరిస్తున్నారు క్రిష్. ఈ పాత్రలో చంద్రబాబుగా దగ్గుబాటి రానా కనిపించనున్న సంగతి తెలిసిందే. అసలు చంద్రబాబు గెటప్ లో రానా ఎలా ఉండబోతున్నాడు అని అనుకుంటున్నా టైములో ఆయన లుక్ ఒకటి బయటికి వచ్చింది. అందులో రానా అచ్ఛం చంద్రబాబులా దిగిపోవడంతో..చంద్రబాబు నాయుడు పాత్ర పూర్తి న్యాయం చేస్తాడని అభిమానులు భావిస్తున్నారు.

రానా త్వరలో ఆప‌రేష‌న్ నిమిత్తం విదేశాల‌కు వెళ్ల‌బోతున్నాడు. అందుకే ‘ఎన్టీఆర్’ లో ఆయనకి సంబంధించి సీన్స్ అన్ని చ‌క చ‌క తీసేయాల‌ని చిత్ర‌బృందం భావిస్తోంది. గత కొంత కాలం నుండి రానా ఆరోగ్య‌ప‌ర‌మైన స‌మ‌స్య‌లు ఎదురుకుంటున్న సంగతి తెలిసిందే. విదేశాలకు వెళ్లి అక్కడ ఆయన కిడ్నీ మార్పిడి చేయించుకోపోతున్నారని వార్తలు వస్తున్నాయి. ఈనేపధ్యంలో రానాకి త‌గిన కిడ్నీ ల‌భించ‌క‌పోవ‌డంతో.. రానా అమ్మ త‌న కిడ్నీని రానా కోసం దానం చేస్తున్నార‌ని తెలుస్తోంది.

వారం పాటు డాక్టర్స్ పరివేక్షణలో ఈ ఆపరేషన్ జరగనుందని తెలుస్తుంది. అందుకే ‘ఎన్టీఆర్’ లో ఆయనకు సంబంధించిన పాత్రను త్వరగా ఫినిష్ చేయాలనీ చిత్ర బృందం భావిస్తుంది. ప్రస్తుతం రానా ఈ సినిమానే కాకుండా మరో రెండు సినిమాలలో నటిస్తున్నాడు. ‘హాథీ మేరీ సాథీ’, ‘1945’ అనే ఈరెండు చిత్రాల షూటింగ్ కేరళలో జ‌రుపుకోవాల్సివుంది. కానీ కేరళలో భారీ వర్షాల తర్వాత అక్కడ షూటింగ్ చేసుకోడానికి సరైన సౌకర్యాలు లేకపోవడంతో ఆ రెండు చిత్రాల షూటింగ్ వాయిదా పడింది. అందుకే ఇప్పుడు ఆప‌రేష‌న్‌కి స‌రైన స‌మ‌యమ‌ని రానా భావించి విదేశాలకు వెళ్లనున్నాడు