వెంకీని వదిలేసి.. రానాని పట్టాడు

telugu post telugu news

తేజ కి బాలకృష్ణ ఎన్టీఆర్ బయో పిక్ కి దర్శకుడిగా అవకాశం ఇవ్వడంతో… తేజ కూడా ఎన్టీఆర్ గురించిన చాలా వివరాలు సేకరించిమరి ఎన్టీఆర్ బయో పిక్ స్క్రిప్ట్ లాక్ చేసి మరీ సినిమాని పట్టాలెక్కించాడు. అంతకుముందే తేజ కి వెంకటేష్ హీరోగా ఆట నాదే – వేట నాదే సినిమా ఛాన్స్ ఇచ్చాడు. ఇక తేజ… వెంకీ సినిమాతో పాటు… ఎన్టీఆర్ బయో పిక్ ని కూడా తీద్దామనుకున్నాడు. అందుకే తేజ, వేంకటేష్ తో కలిసి ఆటా నాదే – వేట నాదే సినిమాకి పూజా కార్యక్రమాలు జరిపి పట్టాలెక్కిద్దామనుకున్నాడు. కానీ బాలయ్య ఎన్టీఆర్ బయో మీద ఇంట్రెస్ట్ తో తేజ, వెంకీ ప్రాజెక్ట్ ని పక్కన పడేసాడు. తీరా చూస్తే ఎన్టీఆర్ బయోపిక్ నుండి తేజ బయటికొచ్చేసాడు.

ఇక వెంకటేష్ తో తేజ మళ్ళీ సినిమా మొదలెట్టబోతున్న న్యూస్ సోషల్ మీడియాలో తెగ హల్చల్ చేసింది. అయితే వెంకీ సినిమా చెయ్యడానికి సురేష్ బాబు తేజ తో చర్చలు జరిపినట్టుగా కూడా అన్నారు. కానీ ఆ చర్చలు సఫలం కాలేదో ఏమో తెలియదు గాని.. వెంకీ ప్రాజెక్ట్ ని కూడా తేజ వదిలేసినట్టే అంటున్నారు. ఎందుకంటే ఇప్పుడు నేనే రాజు – నేనే మంత్రి సినిమాని రానా తో కలిసి హిట్ కొట్టిన తేజ మళ్ళీ రానా వైపే మొగ్గు చూపుతున్నాడని… రానా హీరోగా తేజ దర్శకత్వంలో ఓ సినిమా రూపొందుతుంది అంటున్నారు. దాదాపుగా ఇది ఖాయం అయిపోయింది అని కూడా అంటున్నారు.

మరి ఈలెక్కన వెంకీ – తేజ ల ప్రాజెక్ట్ ఇక పట్టాలెక్కే ఛాన్స్ లేదంటున్నారు. ఇక నేనే రాజు నేనే మంత్రి సినిమాతో ఒకసారి బంపర్ హిట్ కొట్టిన తేజ – రానా ల కాంబో మీద ప్రేక్షకుల్లోనూ ట్రేడ్ వర్గాల్లోను మంచి అంచనాలే ఉన్నాయి.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*