అచ్చం చంద్రబాబు లాగానే!!

లీడర్ లో క్లాసీ లుక్ లో కనబడి… బాహుబలిలో భల్లాల దేవుడు అంటే ఇలానే ఉంటాడు అనిపించేలా.. నేనే రాజు నేనే మంత్రితో కూర్చీలాటలో పొలిటికల్ లీడర్ గా అదరగొట్టిన.. రానా తాజాగా ఎన్టీఆర్ బయో పిక్ లో భాగమవుతున్నాడు. క్రిష్ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ఎన్టీఆర్ బయో పిక్ లో అతి కీలకమైన చంద్రబాబు పాత్రను రానా చేస్తున్నాడు. ఇప్పటికే ఎన్టీఆర్ షూటింగ్ లో జాయిన్ అయిన రానా.. చంద్రబాబు పాత్ర కోసం చాలానే కష్ట పడుతున్నాడట. ఆ పాత్ర కోసం బాగా బరువు తగ్గించాడట. భల్లాల దేవునిగా బరువు పెంచిన రానా.. ఇప్పుడు బాబు గారి పాత్రకోసం బరువు తగ్గించేసానని చెబుతున్నాడు. మరి అచ్చం చంద్రబాబు లా కనబడాలని చాల కష్ట పడుతున్నట్టుగా చెబుతున్నాడు రానా.

మార్పు చూపించాలని…..

బాహుబలి లో భల్లాలదేవ కాబట్టి భారీగా వున్నాడు. ఇప్పుడు చంద్రబాబుగారి పాత్రలోకి వెళ్ళాను కదా…. ఆ మార్పు చూపించడం కోసమే ఇలా కష్టపడి బరువు తగ్గించాను. బాహుబలి కోసం కండలు పెంచాను. తాజాగా ఎన్టీఆర్ సినిమా కోసం అవన్నీ తగ్గించేశా… భల్లాల దేవుడు గురించి ఎవరికీ తెలియదు కాబట్టి రాజమౌళి గారి భల్లాల దేవుణ్ణి కండలు పెంచి చూపించినా ప్రేక్షకులు మెచ్చారు. కానీ ఇక్కడ చంద్రబాబు గారి గురించి అందరికి తెలుసు. మరి ఆయన్ని డిట్టో దించక పొతే ప్రేక్షకులు ఆ పాత్రకి కనెక్ట్ అవరు… అంటూ ఎన్టీఆర్ బయో పిక్ లో తనని క్రిష్ చంద్రబాబుగా ఎలా చూపెట్టబోతున్నాడో ఒక క్లారిటీ ఇచ్చాడు రానా.

వేగంగా చిత్రీకరణ……

క్రిష్ డైరెక్షన్ లో బాలకృష్ణ హీరోగా తెరకెక్కుతున్న ఎన్టీఆర్ బయో పిక్ చిత్రీకరణ శరవేగంగా జరుగుతుంది. ఇప్పటికే రానా ఎన్టీఆర్ బయో పిక్ షూటింగ్ కి హాజరవుతున్నారు. మరికొన్ని రోజులు చిత్రీకరణ చేస్తే అతడి పాత్ర పూర్తవుతుందట. ఇక ఈ సినిమాలో విద్యా బాలన్ బసవతారకం పాత్ర చేస్తుండగా.. రకుల్ ప్రీత్ సింగ్ శ్రీదేవి పాత్రకి ఎంపికయ్యింది. మోహన్ బాబు, నరేష్ లాంటి సీనియర్ నటులు ఈ ఎన్టీఆర్ బయోపిక్ లో భాగస్వాములవుతున్నారు. ఇక ఈ సినిమా సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*