‘రంగస్థలం’ 100 డేస్ చీఫ్ గెస్ట్ ఆయ‌నేనా..!

నటనకు అవకాశం ఉండే పాత్ర కోసం చాలా రోజులు ఎదురు చూసిన రామ్ చరణ్.. మంచి కమెర్షియల్ సినిమా కోసం ఎప్పటి నుండో ఎదురు చూస్తున్న డైరెక్టర్ సుకుమార్.. ఈ ఇద్దరికీ ‘రంగస్థలం’ రూపంలో వాళ్ల‌ కోరిక తీరింది. చరణ్ సరసన సమంత నటించిన ఈ సినిమా విడుదలైన అన్ని ప్రాంతాల్లో విజయవిహారం చేసింది. చరణ్, సుకుమార్ కెరీర్స్ లో బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది.

ఈరోజుల్లో వంద రోజులంటే మామూలా మ‌రి

ప్రేక్షక ఆదరణే కాకుండా క్రిటిక్స్ సైతం మెచ్చిన ఈ చిత్రం తాజాగా 100 రోజులను పూర్తిచేసుకుంది. కలెక్షన్స్ పరంగా ఎన్నో రికార్డ్స్ క్రియేట్ చేసిన ఈ చిత్రం తెలుగు రాష్ట్రాల్లో 15 సెంటర్లలో ఈ సినిమా 100 రోజుల మైలురాయిని దాటేసింది. దానికి సంబంధించి పోస్టర్స్ కూడా రిలీజ్ చేసారు మేకర్స్. ఈ నేపథ్యంలో ఈ నెల 9వ తేదీన హైదరాబాద్ లో 100 రోజుల వేడుకను జరపడానికి సన్నాహాలు చేస్తున్నారు చిత్ర నిర్మాతలు. ఈ కారిక్రమానికి చీఫ్ గెస్ట్ గా చిరంజీవిని ఆహ్వానించినట్టు సమాచారం. ఇప్పుడున్న రోజుల్లో సినిమా 100 రోజులు కంప్లీట్ చేసుకోవటం అంటే మాములు విషయం కాదు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*