రంగస్థలం హిట్ తో ఆలోచనలో పడ్డ చరణ్!!

రామ్ చరణ్ – సుకుమార్ కాంబోలో వచ్చిన రంగస్థలం సినిమా ఎంత పెద్ద హిట్టో తెలిసిందే. రామ్ చరణ్ కెరీర్ లోనే అదరగొట్టే కలెక్షన్స్ తో రంగస్థలం దూసుకుపోయింది. మగధీర, ఖైదీ నెంబర్ 150 రికార్డులను తుడిచిపెట్టేసిన రంగస్థలం 200 కోట్ల క్లబ్బులోకి ఎప్పుడో చేరిపోయింది. అయితే రంగస్థలం హిట్ ని అలానే నిలబెట్టుకోవాలంటే తన తదుపరి ప్రాజెక్ట్ కూడా అంతే పక్కాగా ఉండాలని చరణ్ అనుకుంటున్నాడట. బోయపాటి తో కలిసి చరణ్ చెయ్యబోయే సినిమా విషయంలో చరణ్ అన్ని విషయాల్లోనూ ఆచి తూచి వ్యవహరిస్తున్నట్టుగా సమాచారం.

రెండో షెడ్యూల్…..

బోయపాటి మాత్రం చరణ్ లేకపోయినా జనవరి చివరికల్లా మొదటి షెడ్యూల్ ని కంప్లీట్ చేసి రామ్ చరణ్ కోసం దాదాపుగా రెండు మూడు నెలల పాటు వెయిట్ చేసాడు. ఎట్టకేలకు ఏప్రిల్ 23 నుండి సెకండ్ షెడ్యూల్ మొదలైనప్పటికీ బోయపాటి కేవలం విలన్ వివేక్ ఒబెరాయ్ ఓపెనింగ్ సన్నివేశాలను మాత్రమే తెరకెక్కించినట్లుగా తెలుస్తుంది. అలాగే సెకండ్ షెడ్యూల్ షూటింగ్ కూడా వాయిదాల మీద వాయిదా పడడం… సెకండ్ షెడ్యూల్ లో చరణ్ హీరోయిన్ కైరా అద్వానీల మీద తెరకెక్కించాల్సిన సన్నివేశాలు కూడా వాయిదా పడడంతో కైరా కూడా హైదేరాబద్ నుండి మళ్ళీ ముంబై వెళ్లిపోతుందట.

స్క్రిప్ట్ విషయంలో….

అయితే ఇలా సినిమా సెకండ్ షెడ్యూల్ వాయిదాలు పడడానికి కారణం చరణ్ స్క్రిప్ట్ విషయంలో చెబుతున్న మార్పులు .. చేర్పులు కారణమని తెలుస్తుంది. రంగస్థలం తో హిట్ కొట్టిన చరణ్ మళ్ళీ అంతటి విజయాన్ని సాధించాలి అంటే బోయపాటి స్క్రిప్ట్ పక్కాగా ఉండాలని పట్టుబట్టడంతోనే.. షూటింగు ఆలస్యమవుతోందట. మరి బోయపాటి కూడా చేసేదేం లేక చరణ్ చెబుతున్న మార్పులు చేర్పులను చెయ్యడానికి సిద్దపడుతున్నాడనే టాక్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. మరి చరణ్ గనక ఓకె అంటే వెంటనే సెకండ్ షెడ్యూల్ లో చరణ్ – వివేక్ – కైరా ల తో షూటింగ్ మొదలెట్టేస్తాడట.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*