యూఎస్ లో రికార్డుకు దగ్గరలో రంగస్థలం

టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ రికార్డ్స్ ను రంగస్థలం సినిమాతో షేక్ చేస్తున్న రామ్ చరణ్ ఓవర్సీస్ లో కూడా అదే జోరు కొనసాగిస్తున్నాడు. తెలుగులో దాదాపు అన్ని ఏరియాస్ లో నాన్ బాహుబలి రికార్డ్స్ ను సొంతం చేసుకున్న రంగస్థలం యూఎస్ మార్కెట్ లో ల్యాండ్ మార్క్ ఫిగర్ కి చేరువైంది.

యూఎస్ లో అంతకుముందు శ్రీమంతుడు సినిమాపై ఉన్న 2.89 మిలియన్స్ రికార్డును రంగస్థలం బద్దలు కొట్టిన సంగతి తెలిసిందే. అయితే లేటెస్ట్ గా ఈ సినిమా కలెక్షన్స్ 3.37 మిలియన్స్ కు చేరాయి. అయితే ఈ వారం మహేష్ భరత్ అనే నేను సినిమా రిలీజ్ కు ఉండటంతో.. రంగస్థలం సినిమా 3.50 మిలియన్స్ మార్కుకు రీచ్ అవుతుందా? లేదా ? అన్నది ఆసక్తికరంగా మారింది.

ఒకవేళ రంగస్థలం సినిమా 3.50 మిలియన్స్ కు చేరుకున్న, భరత్ అనే నేను సినిమాకు పాజిటివ్ టాక్ వస్తే మాత్రం రామ్ చరణ్ సాధించిన రికార్డులు కనుమరుగు కావడం ఖాయం అన్న టాక్ ట్రేడ్ పండితుల నుండి వ్యక్తమవుతోంది. ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా కలెక్షన్స్ 200 కోట్లకు చేరుకుంటాయా? లేదా? అన్నది కూడా ఫ్యాన్స్ లో ఉత్కంఠ రేపుతోంది. ఈవారం లో మహేష్ సినిమా ఉంది కాబ్బట్టి 200 కోట్లకు చాలా కష్టం అని చెబుతున్నారు సినీ పండితులు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*