రంగస్థలం తీసేయట్లేదు

ఓ సినిమా కోసం ఎంతో కష్టపడి శ్రమించి సెట్ వేస్తే ఆ సినిమా అయ్యిపోయాక ఆ సెట్ తీసేయాల్సి వస్తే చాలా బాధగా ఉంటుంది. ముఖ్యంగా ఆ సెట్ వేసిన ఆర్ట్ డైరెక్టర్ కు ఉద్వేగానికి గురవుతుంటారు. కానీ సెట్ తీయడం తప్పదు కాబట్టి ఆ వేసిన సెట్ తీసేస్తువుంటారు. కానీ బాహుబలి సినిమా కోసం వేసిన సెట్ తీయాల్సిన పని లేకుండా పోయింది. రామోజీ ఫిలిం సిటీలో దాన్నే ఒక సందర్శన ప్రాంతంగా మార్చేశారు.

దానికి టికెట్ కూడా పెట్టి జనాలని లోపల ఆ సెట్ చూడడానికి పర్మిషన్ ఇస్తున్నారు. అయితే అలానే ఇప్పుడు రంగస్థలం సినిమా కోసం వేసిన సెట్ విషయంలో కూడా జరుగుతుంది. పూర్తి విలేజ్ బ్యాక్ డ్రాప్ వేసిన సెట్ ను ఇంకా తొలగించలేదు. బాహుబలి సెట్ లా ప్రదర్శనకు పెట్టకపోయినా దానికి చూడటానికి చాలా మంది ప్రేక్షకులు అక్కడికి చేరుకుంటున్నారు.

ఆ సెట్ ను అక్కడ నుండి తీయకుండా చిన్న చిన్న మార్పులతో వేరే సినిమాలకు వాడుకుంటున్నారు అని…ఈ సెట్ తీసేయాల్సిన అవసరం రాకపోవడం చాలా సంతోషాన్నిస్తోందని సుకుమార్ తెలిపాడు. గతంలో ‘ఊ కొడతారా ఉలిక్కి పడతారా’ కోసం వేసిన బిల్డింగ్ సెట్ ను కూడా తీసేయాల్సిన అవసరం లేకపోయింది. దాన్ని అలాగే కొనసాగించి తర్వాత వేరే సినిమాల షూటింగుల కోసం ఉపయోగించుకున్నారు. ఇప్పుడు రంగస్థలం సెట్ కూడా అలానే కొనసాగబోతోందన్నమాట

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*