శ్రీనివాస కళ్యాణం తర్వాత ఏంటి అమ్మడూ..?

జై లవకుశ సినిమా అప్పటి వరకు బాగా బొద్దుగా ఉన్న రాశి ఖన్నా… రవితేజ తో కలిసి నటించిన టచ్ చేసి చూడు లో కాస్త బరువు తగ్గింది. అయినా ఆ సినిమా అట్టర్ ఫ్లాప్ అవడంతో.. రాశి ఖన్నా తన బరువు మీద బాగా కాన్సంట్రేట్ చేసింది. జిమ్ లో తెగ కష్టపడి ఒళ్ళు కరిగించేసింది. ఆ వెంటనే వరుణ్ తేజ్ పక్కన తొలిప్రేమలో ఛాన్స్ అందుకుంది. ఆ సినిమాని వెంకీ అట్లూరి అందమైన ప్రేమ కథగా మల్చడమే కాదు.. రాశి ఖన్నా ని చాలా అందంగా చూపెట్టడంతో.. ఆ సినిమా తరవాత రాశి ఖన్నాకి నితిన్ పక్కన దిల్ రాజు బ్యానర్లో శ్రీనివాస కళ్యాణం సినిమాలో ఛాన్స్ అందుకుంది.

తెలుగులో నిల్…తమిళ్ లో ఫుల్

ఈ సినిమాలో రాశి ఖన్నా క్యూట్ లుక్స్, ట్రెడిషనల్ గా అదరగొడుతున్నాయి. మరి ఈ సినిమా కూడా హిట్ అయ్యే అవకాశాలు నూటికి నూరు శాతం అయితే పక్కాగా ఉన్నాయి. మరి ఈ సినిమా తర్వాత రాశి ఖన్నాకి నో ఛాన్స్ అనే బోర్డు అయితే టాలీవుడ్ లో కనబడుతుంది. శ్రీనివాస కళ్యాణం సినిమా తరవాత ఎటువంటి సినిమా రాశి చేతిలో లేదు. మరి యంగ్ హీరోల చిత్రాలేమీ ప్రస్తుతం మొదలయ్యే సూచనలు ఇప్పట్లో లేవు. ఎందుకంటే ఇప్పటికే యంగ్ హీరోల సినిమాలు చాలా.. హీరోయిన్స్ తో కలిపి మొదలైపోయాయి. మరి రాశికి శ్రీనివాస కళ్యాణం తర్వాత మరే సినిమాలోనూ ఛాన్స్ లేదు. సినిమా హిట్ అయితే ఏమన్నా రాశికి మళ్లీ అవకాశాలు తగులుతాయేమో చూడాలి. ఇకపోతే శ్రీనివాస కళ్యాణం సినిమాలో రాశి ఖన్నా లుక్స్ ఏమో కానీ… బయట అంటే శ్రీనివాస కళ్యాణం సినిమా ప్రమోషన్స్ లో చీరకట్టుతో ట్రెడిషనల్ గా మాత్రం అదరగొడుతుంది. ఇకపోతే రాశి ఖన్నా తెలుగులో అవకాశాలేమో కానీ.. తమిళ్ లో మాత్రం రెండు సినిమాలు షూటింగ్ దశలో ఉన్నాయి. ఏది ఏమైనా రాశి ఖన్నాకి శ్రీనివాస కళ్యాణం సినిమా తర్వాత సినిమా ఏంటనేది మాత్రం కాస్త కన్ఫ్యూషన్.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*