కాస్టింగ్ కౌచ్ పై రష్మీ సంచలన వ్యాఖ్యలు..!

ప్రముఖ యాంకర్ రష్మీ గౌతమ్ టాలీవుడ్ లో కాస్టింగ్ కౌచ్ పై సంచలన వ్యాఖ్యలు చేసింది. రీసెంట్ గా ఆమె నటించిన ‘అంతకు మించి’ సినిమాలో తన అందంతో యూత్ ని అట్ట్రాక్ట్ చేద్దాం అనుకుంది కానీ అది ఫలించలేదు. సినిమా డిజాస్టర్ అయ్యి కూర్చుంది. ఈ సినిమా ప్రమోషనల్ ఈవెంట్ లో రష్మీ కాస్టింగ్ కౌచ్ పై వ్యాఖ్యలు చేసింది.

అది తప్పెలా అవుతుంది..?

అవకాశం కోసం వెళ్లడం అన్నది తన దృష్టిలో ఛాయస్ మాత్రమే అని..దాన్ని నేను గౌరవిస్తానని చెప్పిన రష్మీ..కెరీర్ బాగుండటం కోసం కాస్టింగ్ కౌచ్ కు అంగీకరించడంలో తప్పు ఏమి ఉంటుందని వ్యాఖ్యానించింది. మీడియా నుండి వచ్చిన ప్రశ్నకు రష్మీ ఈ సమాధానం చెప్పింది. ఇది ఇద్దరి మధ్య విషయం అని..అది వారిద్దరి అంగీకారంతోనే జరుగుతుందని..దాన్ని మనం కాస్టింగ్ కౌచ్ అని ఎలా చెప్పగలమని ప్రశ్నించింది. వాళ్లు ఎంజాయ్ చేసి బయటికి వచ్చి గొడవ చేయడం ఏంటని..అవకాశాలు ఇస్తామంటే..ఆశపడి వెళ్లిన తర్వాత మళ్లీ బయటికి వచ్చి గొడవలు ఏంటి అని ఇండైరెక్ట్ శ్రీ రెడ్డిని విమర్శించింది.

క్యాస్టింగ్ కౌచ్ అంతటా ఉంది..!

కాస్టింగ్ కౌచ్ అనేది ప్రతి రంగంలో ఉంటుందని కానీ సినీ ఇండస్ట్రీ కొంచం ఎక్కువగా ఉంటుందని.. తనతో మాత్రం ఏ నిర్మాత తప్పుగా ప్రవర్తించలేదని.. నిర్మాతకి, తనకు రెమ్యునరేషన్ విషయంలోనే విభేదాలు వచ్చాయని చెప్పింది రష్మీ. ఈమె చేసిన ఈ కామెంట్స్ ప్రస్తుతం టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారాయి.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*