బిగ్ బాస్-2 విన్నర్ అతనేనట…!

ఈ సీజన్ బిగ్ బాస్ – 2 టైటిల్ విన్నర్ ఎవరు అవుతారు అంటే ఆల్మోస్ట్ అందరూ ఇంకా ఎవరు కౌశల్ యే అంటున్నారు. ఎందుకంటే మనోడికి సోషల్ మీడియాలో అంతలా ఫాలోయింగ్ ఉంది కాబట్టి. అతని పేరు మీద సోషల్ మీడియాలో ఓ వర్గం కూడా ఉంది. దాని పేరే కౌశల్ ఆర్మీ. వాస్తవానికి బిగ్ బాస్ – 2 పైన ప్రేక్షకులు అంతలా ఇంట్రెస్ట్ చూపట్లేదు. ఏదో టైం పాస్ కోసం అప్పుడప్పుడు చూస్తున్నారు అంతే. కానీ కౌశల్ ఏదో స్టార్ హీరో అన్నట్టు రచ్చ చేయడం చూస్తే చాలా అనుమానాలే వచ్చాయి.

గెలవకపోతే ధర్నాలు జరుగుతాయి…

రీసెంట్ గా దీని గురించి యాంకర్ రష్మీ, హీరో ప్రిన్స్ స్పందించారు. ముందుగా రష్మీ…బిగ్ బాస్ – 2లో ఎవరు విన్ అవుతున్నారు అని అడిగితే.. ఇంకెవరు కౌశల్ నే విజేత అని తెల్చిపారేసింది. ఒకవేళ అతడిని విన్ చేయకపోతే బయట ధర్నాలు.. రాస్తారోకోలు జరిగేలా ఉన్నాయని వ్యాఖ్యానించింది. రీసెంట్ గా జరిగిన అంతకు మించి సినిమా ప్రమోషన్ లో భాగంగా ఇచ్చిన ఇంటర్వ్యూలో రష్మీ చెప్పుకొచ్చింది.

కౌశల్ ఆర్మీపై ఘాటు కామెంట్స్…

ఇక హీరో ప్రిన్స్ అయితే…కౌశల్ ఆర్మీ సోషల్ మీడియాలో తెగ ఓవర్ యాక్షన్ చేస్తోందని..ఓటింగ్ వేయకపోతే ఎందుకు మీ జీవితం అన్నట్టు బిహేవ్ చేస్తున్నారని ఘాటుగానే కామెంట్ చేసాడు. అయినా పని లేకపోతే వేరేవి చూసుకోవాలని.. ఇలా ఎవరి లైఫ్ లో వాళ్లు బిజీగా ఉంటే వాళ్లని పట్టుకుని కౌశల్ కి వోట్ వెయ్యాలని చెప్పడం బాలేదని చెప్పాడు. కౌశల్..రష్మీ ఎవరి వెర్షన్ గురించి వారు చెప్పినా కామన్ పాయింట్ మాత్రం కౌశల్ యే. అసలు ఏమాత్రం బ్యాక్ గ్రౌండ్ లేని వ్యక్తిని బిగ్ బాస్ లోకి కావాలనే తీసుకొచ్చారనేది ఇప్పటికీ సస్పెన్స్ గానే ఉంది. ఇలా షో మొత్తం వన్ సైడ్ అవ్వడం చూస్తుంటే… కౌశల్ విన్ అయ్యే స్టేజికి రావడం చూస్తే అది షో విశ్వసనీయతను దెబ్బ తీసే అవకాశం ఉందనిపిస్తోంది. మరి కౌశల్ గెలుస్తాడా లేదో మరో నెలలో తేలిపోనుంది.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*