గీత అబద్దం చెప్పిందా..?

ఛలో, గీత గోవిందం, ఇప్పుడు దేవదాస్ తో తెలుగు ప్రేక్షకుల మనసు దోచేస్తున్న కన్నడ భామ రష్మిక మందన్న అందరికీ అబద్దం చెబుతుందా అంటే… అవుననే సంకేతాలే వినబడుతున్నాయి, కనబడుతున్నాయి. ఇంతకీ రష్మిక ఏ విషయంలో అబద్దం చెబుతుందో తెలుసా.. ఆమె పెళ్లి విషయంలో. ప్రస్తుతం సూపర్ ఫామ్ లో ఉన్న రష్మిక మందన్న గతంలో సహ నటుడు, నిర్మాత, కన్నడ హీరో రక్షిత్ శెట్టి ని ప్రేమించి పెళ్లికి సిద్దమవడమే కాదు.. ఏకంగా ఎంగేజ్మెంట్ కూడా చేసుకుంది. ఇక రష్మిక కి అలా ఎంగేజ్మెంట్ అయ్యిందో లేదో.. అలా కెరీర్ లో తెగ బిజీ అయ్యింది. కెరీర్ లో సూపర్ హిట్ మూవీస్ తో చెలరేగిపోతున్న రష్మిక కెరీర్ మీద దృష్టి పెట్టి ఎంగేజ్మెంట్ చేసుకుని పెళ్లికి గుడ్ బై చెప్పేసిందనే టాక్ ఎప్పటినుండో నడుస్తుంది.

కెరీర్ బాగుండటంతో…

మధ్యలో రష్మిక నా ఎంగేజ్మెంట్ రద్దు చేసుకున్నానన్న విషయంలో వస్తున్న వార్తల్లో నిజం లేదని చెప్పింది. కానీ ఆ వార్తలు ఆగలేదు. తాజాగా ఒక ఇంగ్లీష్ డైలీ లో వచ్చిన కథనం ప్రకారం… గీత గోవిందం హిట్ అయ్యాక రష్మిక పూర్తిగా కెరీర్ మీద దృష్టి సారించి ఎంగేజ్మెంట్ రద్దు చేసుకుందని, అలాగే కొన్ని పర్సనల్ ఇష్యుస్ కూడా ఉండడంతో కన్నడ హీరో రక్షిత్ శెట్టితో చేసుకున్న ఎంగేజ్మెంట్ ని రద్దు చేసుకుందని తెలుస్తుంది. ఈ విషయంలో రష్మిక తన తల్లిదండ్రులు అలాగే తన సన్నిహితుల సలహా కూడా తీసుకున్నట్లుగా చెబుతున్నారు. ప్రస్తుతం కెరీర్ లో రష్మిక పీక్స్ లో ఉంది. మరి ఇప్పుడే ప్రేమ పెళ్లి అంటే కెరీర్ నాశనం అవుతుందనే రష్మిక ఇలాంటి డెసిషన్ తీసుకుంటున్నట్లుగా ఎప్పటినుండో చక్కర్లు కొడుతున్న న్యూస్.