పెళ్లి చేసుకుంటే నటించకూడదా..?

Rashmika new photo

హీరోలైతే పెళ్లయినా ఇంకా నటిస్తూనే ఉంటారు. పెళ్లి తర్వాత పిల్లలు పుట్టి తనంతటి వాళ్లు అయినప్పటికీ వారు హీరోలుగానే కొనసాగుతారు. కానీ హీరోయిన్స్ కి పెళ్లంటేనే భయం. ఇక పెళ్ళై పిల్లలు కనాలన్నా భయమే. అందుకే హీరోయిన్స్ పెళ్ళికి తొందరగా ఒప్పుకోరు. తాజాగా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చి వెంటనే పెళ్లి పీటలెక్కడానికి రెడీ అయిన ఒక హీరోయిన్ పెళ్లి తర్వాత కూడా నటిస్తానని చెప్పడమే కాదు… ఇప్పటికే ఎంగేజ్మెంట్ చేసుకున్నాక కూడా రొమాంటిక్ సీన్స్ లో రెచ్చిపోతుంది. ఆమె ఎవరో కాదు కన్నడలో కిర్రాక్ పార్టీ సినిమాలో కిర్రాక్ పుట్టించిన రష్మిక మందన్న. ఇక ఆ సినిమాతో తెలుగులో ఛలో సినిమా ఆఫర్ రావడం ఆ సినిమా హిట్ అవడంతో మళ్లీ విజయ్ దేవరకొండ సరసన గీత గోవిందం సినిమాలో హీరోయిన్ గా ఛాన్స్ దక్కించుకుంది. మరి కన్నడ కిరాక్ పార్టీ సినిమాతో లైం టైం లోకొచ్చిన రష్మిక కిర్రాక్ పార్టీ హీరో రక్షిత్ తో ప్రేమలో పడి పెళ్లికి రెడీ అవడమే కాదు.. అతనితో ఎంగేజ్మెంట్ కూడా చేసుకుంది. అయితే పెళ్లి తర్వాత కూడా నటిస్తాని చెప్పిన రష్మిక మంచి ఆఫర్స్ తో దూసుకుపోతుంది.

హీరోలకు ఒక రూల్..మాకు మరో రూలా..?

అయితే గీత గోవిందం సినిమాలో విజయ్ దేవరకొండలో మంచి కెమిస్ట్రీ పండిస్తున్న రష్మిక ఆ సినిమాలోని ఒక పోస్టర్ ని సోషల్ మీడియా లో పోస్ట్ చేసింది. ఆ ఫొటోలో విజయ్ దేవరకొండ రష్మికని భుజం మీద ఎత్తుకుని మోస్తున్నాడు. అయితే రష్మిక ఆ ఫోటో పోస్ట్ చెయ్యగానే.. కొందరు ఆమెని తమ కామెంట్స్ తో బెంబేలెత్తించారు. పెళ్లి కుదిరి రక్షిత్ తో నిశ్చితార్ధం చేసుకున్నాక కూడా ఇలాంటి రొమాంటిక్ సీన్స్ లో ఎలా నటిస్తున్నావ్ అంటూ రష్మికని బ్లేమ్ చెయ్యడంతో… ఆగ్రహించిన రష్మిక హీరోలైతే పెళ్లయ్యాక నటిస్తూ రొమాన్స్ చేస్తే మీకు తప్పుకాదు, అదే హీరోయిన్స్ పెళ్లయ్యాక అలాంటి సీన్స్ లో నటిస్తే తప్పొచ్చిందా…

కామెంట్స్ కు ఘాటు రిప్లై

అలాగే హీరోయిన్ మీదున్న అభిమానం అప్పటితో మీకు పోతుంది. అలాగే కొంతమంది ఇలాంటి కామెంట్స్ చేసి మరీ సారీ చెబుతారు. అదేమంటే మీలాంటి హీరోయిన్స్ మాట్లాడడానికి ఇలా చేశామంటారు. హీరోయిన్స్ అయినా మేము మనుషులమే. మాకు కొన్ని ఫీలింగ్స్ ఉంటాయి. మా ఫీలింగ్స్ ని గౌరవించకపోయినా… పర్వాలేదు.. కానీ కామెంట్ చేస్తే సహించనని అని ఘాటు రిప్లై ఇచ్చేసింది. అలాగే ఇలాంటి కామెంట్స్ చేసే వాళ్లను అసలు కేర్ చెయ్యనని చెబుతుంది ఈ భామ.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*