సాయి పల్లవికి పోటీగా మరో హీరోయిన్

సాయి పల్లవి

ఈమధ్య టాలీవుడ్ లో వచ్చిన హీరోయిన్స్ లో యూత్ ని బాగా యాట్ట్రాక్ట్ చేసిన వారు ఇద్దరు. ఒక్కరు సాయి పల్లవి..ఇంకోరు రష్మిక మందాన్నానే. ఆమె నటించిన రెండు సినిమాలు ‘ఛలో’..’గీత గోవిందం’ సినిమాలు బ్లాక్ బస్టర్స్ అవ్వడమే కాదు తన నటనతో చాలామంది ఫ్యాన్స్ ను సంపాదించుకుంది. అయితే సాయి పల్లవిలా హీరోయిన్ కు ప్రాధాన్యం ఉండే పాత్రల్లో చేస్తాను అని మాత్రం చెప్పడంలేదు.

ఏ పాత్రలు ఐన చేయడానికి రెడీ అంటుంది ఈ కన్నడ బ్యూటీ. స్టార్ హీరోస్ తో నటించడానికైనా నేను రెడీ అంటూనే.. గ్లామర్ పాత్రలు చేయడానికి కూడా ఆమె అభ్యంతరం లేదని చెబుతుంది. అందుకే మన నిర్మాతులు కూడా సాయి పల్లవి నో చెప్పితే వెంటనే ఏం ఆలోచించకుండా రష్మికను సంప్రదించుతున్నారు.

రష్మికకి కూడా సాయి పల్లవిలా యూత్ తో పాటు ప్రేక్షకుల్లో కూడా మంచి క్రేజ్ ఉండటంతో..ఆమెనే ఎక్కువ సంప్రదించుతున్నారని వినికిడి. అందుకేనేమో ఆమె కు డిమాండ్ కూడా ఎక్కువ అవడంతో రెమ్యూనరేషన్ కూడా ఎక్కువ చెబుతుంది అని టాక్. స్టార్ హీరోస్ పక్కన ఛాన్స్ రాకపోయినా మీడియం రేంజ్ హీరోస్ కి రష్మిక మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ అయిపోయింది. అంతేకాదు తెలుగు కూడా చక్కగా మాట్లాడుతుంది కాబట్టి ఆమె కు మరిన్ని అవకాశాలు వచ్చే అవకాశం ఉంది.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*