రష్మిక చేతిలో ఇన్ని సినిమాలా..?

rashmika mandanna on her acting

హీరోయిన్ రష్మిక టాలీవుడ్ లో లక్కీ గర్ల్ గా మారబోతుంది. ఎక్కడ చూసినా రష్మికనే కనపడుతుంది. టాలీవుడ్ లో ప్రస్తుతం ఆమెకు మామూలు క్రేజ్ లేదు. చిన్న హీరోల దగ్గర నుండి పెద్ద హీరోల వరకు అంతా ఈమెనే కావాలంటున్నారు. ప్రస్తుతం ఈమె విజయ్ దేవరకొండతో డియర్ కామ్రేడ్ అనే సినిమాలో నటించింది. అలానే నితిన్ హీరోగా భీష్మ అనే సినిమాలో కూడా సెలెక్ట్ అయింది. సూపర్ స్టార్ మహేష్ బాబు, అనిల్ రావిపూడి కాంబినేషన్ లో వస్తున్న సినిమాలో రష్మిక హీరోయిన్ గా ఫైనల్ అయింది.

అల్లు అర్జున్ సినిమాలోనూ…

ఇక లేటెస్ట్ గీత ఆర్ట్స్ లో మరో సినిమా ఓకే చేసింది. అఖిల్ – బొమ్మరిల్లు భాస్కర్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న మూవీలో రష్మికనే హీరోయిన్ గా ఫిక్స్ చేసుకున్నారు. అలా వరుస ఆఫర్స్ తో బిజీగా ఉన్న రష్మిక.. అల్లు అర్జున్ సినిమాలో నటించబోతుందని వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం టాలీవుడ్ లో ఈమెకు ఉన్న క్రేజ్ మరే హీరోయిన్ కి లేదు. ఈమె తరువాత పూజా హెగ్డే ఉంది. రకుల్, రాశీల టైం అయిపోయింది. అందుకే రష్మిక ఏ ఆఫర్ వచ్చిన వద్దు అనకుండా అన్నీ ఓకే చేస్తూ కెరీర్ ని ఓ గాడిలో పెడుతుంది.

Sandeep
About Sandeep 6914 Articles
Sandeep Reddy started his work in journalism at the age of 19 as a local reporter in leading telugu news paper. Later he worked as staff reporter. He has 9 years of experience in print and social media.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*