చీరకట్టులో అదరగొడుతున్న రష్మిక..!

ఛలో సినిమాలో నైట్ డ్రెస్సులు, చుడీదార్స్ లో మత్తెక్కించిన రష్మిక మందన్న.. నిన్నగాక మొన్న విడుదలైన గీత గోవిందం సినిమా లో స్పైసిగా లేకపోయినా చీరకట్టులో చూపు తిప్పుకోలేని అందంతో… కళ్లతోనే హావభావాలూ పలికిస్తూ అదరగొట్టింది. ఈ సినిమాలో చుడీదార్స్ తోనూ, చీరాలలోను రష్మిక అందంగా కనబడింది. విజయ్ దేవరకొండ డ్రీం సాంగ్ లో చీర కట్టులో స్పైసినెస్ తో అదరగొట్టింది. మరి అందాలు ఆరబొయ్యకపోయినా.. మంచి పాత్ర తగిలితే నిరూపించుకోవచ్చు అని రష్మిక గీత గోవిందం సినిమాతో ప్రూవ్ చేసింది. ఇక దేవదాస్ సినిమాలో, విజయ్.. డియర్ కామ్రేడ్ సినిమాల్లో రష్మిక ఎలా వుండబోతుందో తెలియదు కానీ.. తాజాగా రష్మిక ముగ్ద ఆర్ట్ స్టూడియో ఓపెనింగ్ ని విచ్చేసింది. ఆ స్టూడియో ఓపెనింగ్ కి రష్మిక చక్కటి కాంజీవరం పట్టు చీర కట్టులో రష్మికను చూస్తుంటే సింప్లి సూపర్బ్ అనిపించకమానదు.

అచ్చు తెలుగమ్మాయిలా..!

చక్కటి పట్టు చీరలో అందంగా మెరిసిపోతూ… బంగారు ఆభరణాలతో చూడముచ్చటగా వుంది రష్మిక. మరి ఈ పిల్లని చూస్తుంటే కన్నడ భామ అనరేమో.. ఎందుకంటే రష్మిక ఆ చీర కట్టులో అచ్చమైన తెలుగమ్మాయిలా వుంది మరి. ఇకపోతే ప్రస్తుతం రష్మిక తన చేతికొస్తున్న అవకాశాలను వదలకుండానే పారితోషకం పెంచిందనే న్యూస్ సోషల్ మీడియా లో వినబడుతుంది. ఇక కన్నడ హీరో కం నిర్మాతతో ఎంగేజ్మెంట్ చేసుకున్న రష్మిక పెళ్లి ఊసు మాత్రం తియ్యడం లేదు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*