తండ్రీ కొడుకులుగా రవితేజ..?

రాజా ది గ్రేట్ సినిమాతో హిట్ కొట్టిన రవితేజ తన ఎనర్జీతో మరో రెండు సినిమాలు చకచకా చేసేశాడు. కానీ రెండు సినిమాలు కెరీర్ లోనే అట్టర్ ఫ్లాప్ చిత్రాలు అయ్యాయి. టచ్ చేసి చూడు, నేల టిక్కెట్ సినిమాలు ఘోరంగా ఫ్లాప్ అయ్యాయి. అయినా రవితేజ తన స్పీడు ఏమాత్రం తగ్గించలేదు. నేల టిక్కెట్ సినిమా ఫ్లాప్ అయినప్పటికీ శ్రీను వైట్లతో కలిసి అమర్ అక్బర్ ఆంటోని సినిమాని పట్టాలెక్కించేసాడు. ప్రస్తుతం అమెరికాలో షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాలో రవితేజ సరసన గోవా బ్యూటీ ఇలియానా నటిస్తుంది. ఇంకా మరో హీరోయిన్ ని సెట్ చెయ్యాల్సి ఉంది.

రొటీన్ కి భిన్నంగా…

ఆ సినిమా సెట్స్ మీదుండగానే… రవితేజ మరో మూవీని లైన్ లో పెట్టేసినట్లుగా తెలుస్తుంది. అది కూడా ఒక్క క్షణం ఫేమ్ ఆనంద్ డైరెక్షన్ లో రవితేజ మరో మూవీ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడట. ఆనంద్ చెప్పిన స్టోరీలైన్ బాగా నచ్చడంతో ఈ సినిమా చేయాలని రవితేజ డిసైడ్ అయ్యాడట. అయితే ఇందులో రవితేజ డ్యూయెల్ రోల్ చేస్తున్నట్లుగా… అది కూడా తండ్రి కొడుకుల పాత్రలో రవితేజ నటించబోతున్నట్లుగా సమాచారం. ఈ రెండు రోల్స్ రొటీన్ గా ఉండవని .. తండ్రి కొడుకులుగా రవితేజ క్యారెక్టర్స్ లో విభిన్నత ఉంటుందని టాక్.

మరో కిక్ 2 కాదు కదా..?

ఇక రవితేజ ఇప్పటివరకు పూర్తిస్థాయి తండ్రిగా కనిపించిన సినిమాలేవీ లేవు. సురేందర్ రెడ్డి డైరెక్షన్ లో వచ్చిన కిక్ 2 లో రవితేజ కొన్ని నిమిషాలు తండ్రి క్యారెక్టర్ లో కనిపించాడు. కానీ ఇంతవరకు పూర్తి స్థాయి తండ్రి పాత్ర చేసింది లేదు. కానీ కిక్ 2 సినిమా రవితేజ కెరీర్ లోనే అట్టర్ ఫ్లాప్ మూవీ. ఇక ఆనంద్ సినిమాలో రవితేజ తండ్రి కొడుకుల పాత్రలో ఎలాంటి వేరియేషన్స్ చూపిస్తాడో అనేది కొద్దీ రోజులు వెయిట్ చేస్తే తెలుస్తుంది.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*