తూచ్… సినిమాలో మూడు కేరెక్టర్స్ కాదు.. ఒకే కేరెక్టర్!!

టచ్ చేసి చూడు, నెల టికెట్ సినిమాల ప్లాప్స్ తో రవితేజ ప్లాప్ డైరెక్టర్ లిస్ట్ లో ఉన్న శ్రీను వైట్లను పిలిచి మరీ సినిమా అవకాశం ఇచ్చాడు. శ్రీను వైట్ల గత చిత్రాలు వరసగా ప్లాప్ అవడంతో.. అతనికి సినిమా ఇచ్చే హీరో లేకపోవడంతో… స్నేహితుడైన రవితేజ శ్రీను వైట్లకి ఒక అవకాశం ఇచ్చాడు. అయితే ఫ్రెండిషిప్ వల్ల ఈ సినిమా చేయడంలేదు.. కథ నచ్చే సినిమా చేస్తున్నానని.. రవితేజ ఎంతగా చెప్పినా.. కూడా స్నేహితుడు కోసమే ఈ సినిమా చేస్తున్నాడనిపిస్తుంది ఆ సినిమా ఫస్ట్ లుక్ చూస్తుంటే. అమర్ – అక్బర్ – ఆంటోనిగా తెరకెక్కుతున్న ఈసినిమా లో రవితేజ మూడు కేరెక్టర్స్ చెయ్యబోతున్నాడనేది ఆ సినిమా టైటిల్ నుండి ఊహించేసుకున్నారు. అమర్ – అక్బర్ – ఆంటోని లో మూడు కేరెక్టర్స్ తో రవితేజ మూడు పాత్రలు చెయ్యబోతున్నాడంటూ ప్రచారం జరిగింది.

ఇలియానా రీ ఎంట్రీ……

ఇక ఈసినిమాలో ఇలియానా మళ్ళీ సౌత్ లోకి రీ ఎంట్రీ ఇస్తుంది. మరి మూడు కేరెక్టర్స్ లో ఉన్న ఈసినిమాలో ఒకే హీరోయిన్ ఏమిటా అనే అని ఆలోచించేలోపే.. ఈసినిమాలో రవితేజ మూడు పాత్రలు చెయ్యడం లేదని.. ఒక్క రవితేజనే మూడు డిఫరెంట్ షేడ్స్‌లో కనిపించబోతున్నాడనే టాక్ ఫిలింసర్కిల్స్ లో వినబడుతుంది. మరి అమర్ – అక్బర్ – ఆంటోని ఫస్ట్ లుక్ పోటర్ లో ఆత్రం రవితేజ మూడు గెటప్స్ లో కనబడుతున్నాడు. అందుకే అంతా రవితేజ త్రిపాత్రాభినయం చేస్తున్నాడన్నారు. అయితే తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమాలో రవితేజ ఒకే పాత్రలో కనిపిస్తాడని.. అది కూడా మల్టిపుల్ పర్సనాలిటీ డిజార్డర్‌తో బాధపడుతుంటాడట. అందుకే ఆ కారణంగానే తనకు తెలియకుండా రవితేజ అమర్‌ , అక్బర్‌, ఆంటోని క్యారెక్టర్స్‌గా మారిపోతుంతాడట.

క్యారెక్టర్ మారుస్తూ….

ఇక అలా కేరెక్టర్స్ మార్చుకునే సన్నివేశాల్లో దర్శకుడు శ్రీను వైట్ల కావాల్సినంత కామెడీ రాసుకున్నాడట. ఇక ఆ సన్నివేశాల్లో వచ్చే కామెడీ డైలాగ్స్ సినిమా ఆసాంతం కడుపుబ్బా నవ్విస్తాయట. ఇంకా ఈసినిమాలో చాలా రోజుల తర్వాత సునీల్ కమేడియన్ గా నటిస్తున్నాడు. రవితేజ మూడు పాత్రల్లో మారేటప్పుడు సునీల్ రవితేజ పక్కనే ఉంటాడని.. ఆయా సన్నివేశాల్లో రవితేజతో పాటుగా… సునీల్ కూడా కడుపుబ్బా నవ్విస్తాడని అంటున్నారు. ఇకపోతే ప్రస్తుతం అమెరికాలో షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా అక్టోబర్ లో విడుదలకాబోతుంది.