రవితేజ ఫస్ట్ లుక్ సూపర్..!

ప్రస్తుతం టాలీవుడ్ లో చిత్ర పరిశ్రమ దగ్గర నుండి ప్రేక్షకుల వరకు అంతా కొత్తదనమే కోరుకుంటున్నారు. సినిమా టైటిల్స్ దగ్గర నుండి సినిమాలో కంటెంట్ వరకు కొత్తదనమే కోరుకుంటున్నారు. రీసెంట్ గా రిలీజ్ అయిన రవి తేజ త్రీ షేడ్స్ లో నటించిన `అమ‌ర్ అక్బ‌ర్ ఆంటోనీ` కి టైటిల్ లోగోకు మంచి రెస్పాన్స్ వచ్చింది. లేటెస్ట్ గా టైటిల్ లోగోను రిలీజ్ చేశారు మేకర్స్. చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండటంతో ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇక నిన్న ఈ సినిమాలో రవితేజ ఫస్ట్ లుక్ ను రివీల్ చేశారు. రవితేజ హీరోగా ఇలియానా క‌థానాయిక‌గా నటిస్తున్న ఈ సినిమాలో రవితేజ త్రిపాత్రాభిన‌యం చేస్తున్నాడ‌ని ముందు నుంచీ ప్ర‌చారం జ‌రుగుతూనే ఉంది. దానికి తగ్గట్టే నిన్న రిలీజ్ అయిన ఫస్ట్ లుక్ లో మూడు గెట‌ప్పుల్లో దర్శనం ఇచ్చాడు రవి. అమర్ లుక్ చాలా స్టైలిష్ గా ఉంటె..అక్బర్ లుక్ లో రవి ముస్లిం గా టోపీ పెట్టుకున్నాడు.. ఆంటోనీ లుక్ లో కోర్ట్ వేసుకుని చాలా డీసెంట్ గా కనిపిస్తున్నాడు.

ఫ్యాన్స్ కి పండుగే..!

పేక ముక్క‌ల్లో హీరో బొమ్మ‌ని చూపించ‌డం కూడా ఓల్డ్ కాన్సెప్టే. శ్రీను వైట్లకి ఇది కం బ్యాక్ ఫిలిం అవుతుందని.. తన మార్క్ కామెడీ ఇందులో ఉంటుందని అంతా ఆశ‌తో ఎదురు చూస్తున్నారు. రవితేజ సింగల్ క్యారెక్టర్ చేస్తేనే ఫ్యాన్స్ కు ఫీస్ట్.. అలాంటిది మూడు క్యారెక్టర్లు చేస్తే పండగే అని ఫ్యాన్స్ భావిస్తున్నారు. ఇక ఈ సినిమాను వరస హిట్స్ తో దూసుకుపోతున్న మైత్రీ మూవీస్ వారు నిర్మిస్తున్నారు. కాకపోతే రవితేజ త్రీ లుక్స్ చూస్తుంటే అన్ని ఒకే రకంగా ఉన్నాయి. రవి హెయిర్ స్టైల్ లో కూడా మార్పులు లేవు. త్రీ గెట్ అప్స్ తో కనిపిస్తున్నప్పుడు ఏ ఒక్క గెట్ అప్ కి పోలిక ఉండకూడదు. కానీ ఇందులో ఆలా లేదు. మరీ సినిమాలో ఏం చేస్తారో చూడాలి .

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*