ఫ్లాప్ హీరోయిన్ తో రవితేజ

raviteja and mythri movie makers deal telugu post telugu news

వరస ఫ్లాప్స్ తర్వాత రవితేజ.. శ్రీను వైట్ల డైరెక్షన్ ‘అమర్ అక్బర్ ఆంటోనీ’ అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా అటు శ్రీను వైట్లకు.. రవితేజకు ఇద్దరికీ కీలకం కానుంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుపుకుంటుంది. దసరా కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది. గతంలో వీరి కాంబినేషన్ లో వచ్చిన ‘వెంకీ’.. ‘దుబాయ్ శ్రీను’ లానే ఈ సినిమాను కూడా ఫుల్ ఎంటర్టైన్మెంట్ తో తెరకెక్కిస్తున్నారట. ఇక ఈ సినిమా తర్వాత రవితేజ మరో సినిమాలో నటించడానికి రెడీ అవుతున్నాడు. ‘టైగర్’, ‘ఎక్కడికి పోతావు చిన్నవాడ’ ఫేమ్ విఐ ఆనంద్ దర్శకత్వంలో రవితేజ ఓ సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడంట.

మళ్లీ ఆ హిరోయినే ఎందుకు..?

ఇందులో రవితేజ రెండు పాత్రల్లో నటించనున్నాడు. అయితే మరోసారి రవితేజతో మాళవిక శర్మ జోడి కట్టనుంది. లేటెస్ట్ గా వీరి కాంబినేషన్ ‘నేల టిక్కెట్టు’ వచ్చింది. ఆ సినిమా డిజాస్టర్ గా నిలించింది. మళ్లీ ఇప్పుడు అదే కాంబినేషన్ ని ఎందుకు రిపీట్ చేస్తున్నారో అర్ధం కానీ విషయం. చూద్దాం ఏమన్నా మిరాకిల్స్ జరిగి సినిమా హిట్ అవ్వొచ్చేమో.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*