ఏంటీ ‘నేలటికెట్’ ఆ హీరో చేయాల్సిన సినిమానా?

అక్కినేని సినీ ఇన్స్టిట్యూట్ లో కోర్సు నేర్చుకున్న డైరెక్టర్ కళ్యాణ్ కృష్ణ అక్కినేని నాగార్జున తో ‘సోగ్గాడే చిన్నినాయ‌నా’ సినిమా తీసి సక్సెస్ అయ్యాడు. దాంతో నాగార్జునకి తన వర్క్ నచ్చడంతో వెంటనే ‘రారండోయ్ వేడుక చూద్దాం’ సినిమాకు ఛాన్స్ ఇచ్చాడు. ఆ సినిమా చైతూ కెరీర్లోనే బిగ్గెస్ట్ హిట్‌.

రెండు హిట్ లిచ్చినా నిరీక్షణ తప్పలేదు…

రెండు బ్యాక్ టూ బ్యాక్ హిట్స్ ఇచ్చినా మ‌రో సినిమా చేయ‌డానికి బాగా వెయిట్ చేయాల్సి వ‌చ్చింది. ఇప్పుడు ఆయ‌న మాస్ రాజా ర‌వితేజ‌తో చేసిన ‘నేల‌టికెట్‌’ వ‌చ్చేవారం విడుద‌ల‌కి సిద్ధంగా ఉంది. ప్రస్తుతం ఆ సినిమా ప్రొమోషన్స్ లో ఉన్న కళ్యాణ్ కృష్ణ ఓ ఇంటర్వ్యూ లో మాట్లాడుతూ…‘‘ ‘రారండోయ్ వేడుక చూద్దాం’ సినిమా సక్సెస్ తర్వాతే ఈ సినిమా కథ రాసా. ఈ కథ రాసుకునేటపుడే వేరే పెద్ద హీరోను దృష్టిలో పెట్టుకుని రాసుకున్నా. కానీ ఆ హీరోతో ఈ ప్రాజెక్ట్ వర్క్ అవుట్ అవ్వలేదు. దాంతో ప‌క్క‌న పెట్టేశా. అనుకోకుండా ఓసారి ర‌వితేజ‌ని క‌లిసిన‌ప్పుడు క‌థ వినిపించాను, నిముషాల్లోనే ఆయ‌న క‌థ న‌చ్చి ఓకే చెప్పేశారు.’’ అని చెప్పారు.

రవితేజ ఇమేజ్ కు సెట్టయ్యేనా..?

‘‘రవితేజ ఇమేజ్ తగ్గట్టు ఈ కథలో చాలా మార్పులు చేశా. ఫస్ట్ కాపీ చూసాక ఈ సినిమాకు ర‌వితేజ‌యే కరెక్ట్ అనిపించింది’’ అని కళ్యాణ్ కృష్ణ అన్నాడు. ‘రారండోయ్ వేడుక చూద్దాం’ సినిమా తర్వాత కళ్యాణ్ కృష్ణ నాగ్ తో ఓ సినిమా చేయాల్సి ఉంది. కానీ అది క్యాన్సిల్ అయింది. ఆ కథే ఇప్పుడు రవితేజ చేసాడు. అయితే అప్పుడు నాగ్ ను దృష్టిలో పెట్టుకుని రాసిన ఈ కథ రవి తేజ ఇమేజ్ కి సెట్ అవుతుందా? మరి ఈ సినిమాకు నాగ్ క‌రెక్టా! ర‌వితేజ క‌రెక్టా? అని తెలియాలంటే వచ్చే వారం దాకా ఆగాల్సిందే.