రవితేజ ఎందుకు ఇలా చేస్తున్నాడు..?

ప్రస్తుతం ఇండస్ట్రీ లో రవితేజ గురించి టాక్స్ నడుస్తున్నాయి. రవితేజ సినిమా చేసే ముందు ఆ సినిమాకి ఎంత పారితోషికం ఇస్తారు, ఎన్ని రోజుల్లో పూర్తి చేస్తారు అనేది మాట్లాడుకుని, నచ్చితే డీల్‌ అంటున్నాడట. అసలు సినిమాలో కథ ఏంటి.. సినిమాలో తన పాత్ర ఏంటి అన్న విషయాలు ఏమి అడగకుండా సినిమాను ఒకే చేసేస్తున్నాడని వార్తలు వస్తున్నాయి.

భారీగా నష్టాలు…

లేటెస్ట్ గా రవితేజ నటించిన ‘నేల టిక్కెట్టు’ సినిమా ఈ ఆదివారానికి ఏడున్నర కోట్ల షేర్‌ వసూలు చేసి సోమవారం నుంచి ముసుగు తన్నేసింది. ఈ చిత్రాన్ని కొన్న బయర్స్ కి 60 నుండి 70 శాతం వరకు నష్టాలు తప్పవని ట్రేడ్ వర్గాలు చెబుతున్నారు. అయినా కానీ రవితేజ దాని గురించి ఆలోచించడం లేదు.

హిట్, ఫ్లాప్ లతో సంబంధం లేదు…

తన సినిమా హిట్ అయిందో, ప్లాప్ అయిందో అన్న విషయం గురించి ఏమి పట్టించుకోకుండా తన తర్వాత సినిమా షూటింగ్ లో పాల్గొన్నాడు. అంతే కాకుండా తమిళ్ లో విజయ్ నటించిన ‘తెరి’ సినిమాను తెలుగు రీమేక్ చేసేందుకు ఒకే చెప్పినట్టు టాక్. మిగతా హీరోలంతా హిట్‌ సినిమాల కోసం నానా తంటాలు పడుతోంటే రవితేజ మాత్రం ఎవరేమైపోయినా తనకి రావాల్సింది తనకొచ్చేస్తే చాలన్నట్టు ఉండటం తగదని అంటున్నారు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*


UA-88807511-1