తెరి రీమేక్ గురించి తర్వాత ఆలోచిద్దాం..!

హిట్స్, ఫ్లాప్స్ తో సంబంధం లేకుండా వరసబెట్టి సినిమాలు చేస్తూ వెళ్ళిపోతున్నాడు హీరో రవితేజ. లేటెస్ట్ గా అతనికి వరసగా రెండు ఫ్లాప్స్ వచ్చాయి. ‘టచ్ చేసి చూడుస‌, ‘నేల టిక్కెటు’ సినిమాలు ప్రేక్షకుల దగ్గరే కాదు బాక్స్ ఆఫీస్ ని కూడా బాగా నిరాశపరిచాయి. ఈ రెండూ డిజాస్టర్లుగా మిగిలిపోవడం అభిమానులను నిరాశపరిచింది.

త‌న మిత్రుడితోనే….

ఈ ఫలితం నుండి బయట పడేందుకు తన మిత్రుడితో తర్వాతి సినిమా స్టార్ట్ చేశాడు. తనకు మంచి లైఫ్ ఇచ్చిన శ్రీను వైట్ల డైరెక్షన్ లో ‘అమర్ అక్బర్ ఆంటోని’ సినిమా చేస్తున్నాడు. ఇందులో రవితేజ త్రీ షేడ్స్ లో కనిపించబోతున్నాడు. మరోపక్క తమిళ స్టార్ హీరో విజయ్ నటించిన ‘తెరి’ రీమేక్ లో నటించడానికి ఎప్పుడో గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ఈ సినిమాను ‘కందిరీగ’ ఫేమ్ డైరెక్టర్ సంతోష్ శ్రీనివాస్ డైరెక్ట్ చేయనున్నాడు.

ఫ్లాప్‌ల ప్ర‌భావం ప‌డిందా…

అయితే ఈ సినిమాలో సెకండ్ హాఫ్ లో చాలా మార్పులు చేసి స్క్రిప్ట్ రెడీ చేశాడు డైరెక్టర్ సంతోష్ శ్రీనివాస్. ఈ రెండు సినిమాలు ఒకేసారి షూటింగ్ చేద్దామని ముందు నుంచి రవితేజ ఆలోచిస్తున్నా ప్రస్తుతం మనసు మార్చుకున్నాడు. ప్రస్తుతం తన ఫోకస్ మొత్తం ‘అమర్ అక్బర్ ఆంటోని’పైనే పెట్టాడు. ‘తెరి’ సినిమా గురించి తర్వాత ఆలోచిద్దాం అని నిర్మాతలకు చెప్పేశాడు రవితేజ. ఈ రెండు సినిమాల ప్రభావం మనవాడిపై బాగానే పడిందనే చెప్పాలి.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*