షూటింగ్ స్పాట్ లో తెగ ఎంజాయ్ చేస్తున్నారుగా..!

బోయపాటి దర్శకత్వంలో రామ్ చరణ్ #RC12లో నటిస్తున్నాడు. షూటింగ్ మొదలు పెట్టుకుని కొన్ని నెలలు గడుస్తున్నప్పటికీ… ఇంతవరకు ఆ సినిమా ఫస్ట్ లుక్ గాని, ఆ సినిమా టైటిల్ గాని బయటికి రాలేదు. చాలా పెద్ద ప్రాజెక్టుల సినిమాల స్టిల్స్, సీన్స్ విడతల వారీగా లీకవుతున్నప్పటికీ రామ్ చరణ్ #RC12 సంబంధించిన స్టిల్స్, ఆ సినిమా సీన్ గానీ ఎక్కడా బయటికి రాలేదు. ప్రస్తుతం రామ్ చరణ్ – బోయపాటి సినిమా షూటింగ్ అజర్‌ బైజాన్‌లో శరవేగంగా జరుగుతోంది. అజర్‌ బైజాన్‌లో ఎయిర్ పోర్ట్, రెస్టారెంట్స్ లో మరికొన్ని సన్నివేశాలను తెరకెక్కిస్తున్నారట. యాక్షన్ సీక్వెన్సెస్ కి రిలేటెడ్ సీన్స్ నే తెరకెక్కిస్తున్నట్టుగా తెలుస్తుంది. ఇందుకోసం కియారా అద్వానీ అజర్‌ బైజాన్‌ చేరుకుంది. అలాగే కీలక సన్నివేశాల్లో తమిళ సీనియర్ హీరో ప్రశాంత్ పాటుగా, ఆర్యన్ రాజేష్, వివేక్ ఒబెరాయ్ కూడా పాల్గొంటున్న విషయాలు… అక్కడ నుండి #RC12 చిత్ర బృందం సోషల్ మీడియాలో షేర్ చేసింది. మరి అజర్‌ బైజాన్‌లో లొకేషన్స్ కొత్తగా, సరికొత్తగా ఉన్నాయనే టాక్ మాత్రం మెగా ఫాన్స్ ని ఖుషి చేసేస్తుంది. మరో వారానికల్లా అజర్‌ బైజాన్‌లో షూటింగ్ కంప్లీట్ చేసి హైదరాబాద్ కి చిత్ర బృందం తిరుగు పయనం కానుందని సమాచారం అందుతుంది.

టైటిల్ అది కాదు…

ఇకపోతే #RC12 కి నిన్నటినుండి సోషల్ మీడియాలో స్టేట్ రౌడీ అనే టైటిల్ ప్రచారంలోకి అవచ్చింది. ఏదో ఒక అభిమాని చిరు సూపర్ హిట్ చిత్రం స్టేట్ రౌడీని చరణ్ ఫోటో తో స్వంతంగా డిజైన్ చేసి పోస్టర్ రూపంలో ఆన్ లైన్ లో పెట్టేయడంతో అది కాస్తా వైరల్ గా మారి చరణ్ – బోయపాటి సినిమా టైటిల్ అదే అనుకునే ప్రచారం జరిగింది. అయితే #RC12 బృందం మాత్రం స్టేట్ రౌడీ అనే టైటిల్ అసలు పరిశీలనలోనే లేదట. ఇదంతా ఒట్టి పుకారు అని కొట్టిపారేస్తోంది. టైటిల్ ఇంకా డిసైడ్ చేయలేదని విడుదలకు ఇంకా మూడు నెలలకు పైగా సమయం ఉంది కాబట్టి మంచి టైం చూసుకుని చెప్పేస్తాం అంటున్నారు. మరి #RC12 టైటిల్, ఫస్ట్ లుక్ దసరా కానుకగా విడుదల చేస్తారనే ప్రచారం మాత్రం మెగా ఫాన్స్ కి కునుకు లేకుండా చేస్తుంది. మరి చాలా రోజుల నుండి చరణ్ లుక్ కోసం మెగా ఫాన్స్ తెగ వెయిట్ చేస్తున్నారాయే.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*


UA-88807511-1