గ్లామర్ తో అవకాశాలు పట్టేస్తుంది..!

టాలీవుడ్ లో పెద్దగా అవకాశాలు లేని రెజినా ప్రస్తుతం కోలీవుడ్ లో బిజీ తారగా మారింది. తెలుగులో జ్యో అచ్యుతానంద, కొత్త జంట వంటి హిట్ సినిమాల్లో నటించిన రెజినాకి తెలుగులో ఓ అన్నంత బ్రేక్ రాకపోవడంతో… అమ్మడు తమిళంలో పాగా వెయ్యాలని ఫిక్స్ అయ్యింది. ఇక అందాల ఆరబోతకు కాస్త దూరంగా ఉన్న రెజీనా ఇప్పుడు గ్లామర్ షోకి అడ్డూఅదుపు లేకుండా పోయింది. కోలీవుడ్ లో రెజినా నటించిన చంద్రమౌళి సినిమాలో రెజినా అందాల ఆరబోత ఓ రేంజ్ లో ఉండడం… మంచి కంటెంట్ తో సినిమా తెరకెక్కడంతో ఆ సినిమా కోలీవుడ్ లో సూపర్ హిట్ అయ్యింది. ఆ సినిమాలో రెజినా అందాల ఆరబోతకు మంచి పేరొచ్చింది.

అరవింద్ స్వామికి జోడీగా…

ఇక ప్రస్తుతం సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చి అదరగొట్టే అవకాశాలతో దూసుకుపోతున్న అలనాటి అందగాడు అరవింద్ స్వామి.. తనకు తగిన పాత్రలను ఎంచుకుంటూ హీరోగా దూసుకుపోతున్నాడు. తాజాగా అరవింద్ స్వామి నటించిన నరకసూరన్, చదురంగవేట్టై సినిమాలు విడుదలకు సిద్ధమవుతుండగా… ఇప్పుడు కొత్తగా మరో సినిమాని మొదలెట్టబోతున్నాడు. అయితే అరవింద్ స్వామి హీరోగా రాజ పాండి దర్శకత్వంలో తెరకెక్కబోతున్న సినిమాలో అరవింద్ స్వామికి జోడిగా రెజినా ఎంపికైంది. ఎన్నమో నడక్కుదు, అచ్చమిండ్రి సినిమాల దర్శకుడు రాజపాండి అరవింద స్వామి – రెజినా జంటగా సస్పెన్స్ థ్రిల్లర్ గా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు.

ఇక కోలీవుడ్ లోనేనా..!

వచ్చే నెల ఫస్ట్ వీక్ లో సెట్స్ మీదకెళ్లనున్న ఈ సినిమా షూటింగ్ మొత్తంగా చెన్నై నగరంలోనే జరగనుందని టాక్. మరి వరస అవకాశాలతో రెజీనా కోలీవుడ్ లోనే స్థిరపడేలా కనబడుతుంది. అయినా బిజీ అవకాశాలు ఉంటే… ఏ భాష అయితేనేం. మంచి ఫామ్ లో ఉండాలేగాని… ఎక్కడైనా హీరోయిన్స్ కి ఓకె. అందుకే టాలీవుడ్ లో అవకాశాలు లేకపోయినా.. తన గ్లామర్ తో కోలీవుడ్ లో అవకాశాలు ఒడిసి పట్టుకుంటుంది ఈ చిన్నది.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*