రేణు దేశాయ్ ఇంకా కష్టమే అంట!

rrenu desai film career

త్రివిక్రమ్ తన ప్రతి సినిమాలో తల్లి పాత్రలకు సీనియర్ హీరోయిన్స్ ని తీసుకొచ్చి వారికి మరిన్ని అవకాశాలు దక్కేలా చేస్తాడు. నదియా దగ్గర నుండి శరణ్య వరకు చాలామంది సీనియర్ హీరోయిన్స్ కి లైఫ్ ఇచ్చాడు. త్రివిక్రమ్ ను ఫాలో అయ్యి ఈ ట్రెండ్ ను చాలామంది దర్శకులు ఫాలో అయ్యి తమ సినిమాల్లో సీనియర్స్ హీరోయిన్స్ కి తల్లి పాత్రలు ఇచ్చారు. ఈ నేపథ్యంలో లేటెస్ట్ గా ఓ ప్రొడ్యూసర్ తన సినిమాలో తల్లి పాత్ర కోసం పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్ ని అడిగాడట.

ఇప్పుడైతే కుదరదు…

ఆమె ఈ పాత్ర చేస్తే సినిమాకి మరింత క్రేజ్ వస్తుందని భావించి అడిగాడట. అయితే అందుకు రేణు దేశాయ్ పెద్దగా ఇంట్రెస్ట్ చూపలేదని తెలుస్తుంది. దానికి కారణం.. ఈ మధ్య తనకు ఆరోగ్యం బాగోలేదని అందుకే సినిమాల్లో కనిపించడం లేదని ఇన్సైడ్ టాక్. సినిమాల్లో కనిపించకపోయినా సోషల్ మీడియాలో యాక్టీవ్ గానే ఉంటుంది. మొత్తానికి రేణు దేశాయ్ తో రీ ఎంట్రీ ఇప్పించడానికి ప్రయత్నాలు జరుగుతూనే ఉన్నాయన్న మాట. ఫ్యూచర్ లో కూడా ఆమె సినిమాల్లో నటించడం కష్టమేనని ఫిల్మ్ నగర్ లో ఒక టాక్ వినిపిస్తోంది.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*