రోబో ‘2.0’ టార్గెట్ ను ఫిక్స్ చేసుకున్నారు..!

గత ఏడాది దీపావలికి రిలీజ్ అవ్వాల్సిన ‘2.0’ చిత్రం ఇంకా రిలీజ్ అవ్వలేదు. మేకర్స్ కూడా దీని రిలీజ్ డేట్ ఇంకా ఫిక్స్ చేయలేదు. సినిమాకు సంబంధించి హెవీ గ్రాఫిక్స్ ఉండటంతో… విజువల్ ఎఫెక్ట్స్ విషయంలో శంకర్ కాంప్రమైజ్ కాకపోవడమే సినిమా ఇంత ఆలస్యమవడానికి కారణమంటున్నారు. అందుకే రిలీజ్ డేట్ ఆలస్యం అవుతుందని మేకర్స్ చెబుతున్నారు. అయితే తాజా సమాచారం ప్రకారం ఈ ఏడాది ‘2.0’ విడుదలయ్యే అవకాశాలే లేవంటున్నారు.

రెండు బాలీవుడ్ సినిమాలే అడ్డంకి…

వర్క్ త్వరగా ఫినిష్ చేస్తే ఈ ఏడాది చివర్లో ఏమైనా రిలీజ్ చేసుకునే అవకాశం ఉంది. కానీ అప్పుడు రిలీజ్ వద్దని చిత్ర బృందం ఫిక్సయినట్లు సమాచారం. ఇందుకు వేరే భారీ సినిమాలతో క్లాష్ వస్తుండటమే కారణం. అమీర్ ఖాన్ కొత్త చిత్రం ‘థగ్స్ ఆఫ్ హిందుస్థాన్’ దీపావళికి షెడ్యూల్ అయింది. అలానే షారుఖ్ ‘జీరో’ మూవీ క్రిస్మస్ కానుకగా రెడీ అవుతుంది.

ఇక వచ్చే సమ్మర్…

ఈ రెండు సినిమాలు ఎప్పుడో రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకున్నాయి. ఈ విషయంలో బాలీవుడ్ చాలా పక్కాగా ఉంటుంది. అందుకే రోబో మేకర్స్ ఈ ఏడాది రిలీజ్ అనే మాట పక్కన పెట్టేశారంట. వచ్చే ఏడాది స్టార్టింగ్ లో అంటే రిపబ్లిక్ డే కానుకగా సినిమాను రిలీజ్ చేయాలనుకుంటున్నారట. ఒకవేళ అప్పుడు కుదరకపోతే సమ్మర్ కే రిలీజ్ చేస్తారు. అయితే ఈసారి సమ్మర్ లోపల ఎట్టి పరిస్థితిల్లో ఈ సినిమాను రిలీజ్ చేయాలనీ ప్లాన్ చేస్తున్నారు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*