‘రోబో 2.0’ కొన్న బయర్స్ కు భయం పట్టుకుంది..!

జూన్ 7న వరల్డ్ వైడ్ రిలీజ్ అయిన ‘కాలా’ చిత్రం ప్రేక్షకులని నిరాశ పరిచిందనే చెప్పాలి. తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమాకు దారుణమైన వసూళ్లు వస్తున్నాయి. మొదటి నాలుగు రోజుల్లో 7 కోట్ల షేర్ ని మాత్రమే వసూల్ చేసుకుని భారీ పరాజయం దిశగా సాగుతోంది. దీనికి వస్తున్న స్పందనతో ‘రోబో 2.0’ చిత్రాన్ని తెలుగులో రైట్స్ తీసుకోవడానికి బయర్స్ లో వణుకు మొదలైంది.

రిలీజ్ పై ఇంకా రాని క్లారిటీ…

‘కాలా’ హక్కులను దాదాపు ఎనభై కోట్లు పెట్టి బయర్స్ తీసుకున్నారు అని టాక్. రజనీ సినిమాలు వారుసగా ప్లాప్ అవ్వడంతో..ఈ సినిమాను థర్డ్‌ పార్టీ వాళ్లు కొంటారా అనే అనుమానాలు మొదలయ్యాయి. దానికి తోడు ఈ చిత్రం ఎప్పుడు రిలీజ్ అవుతుందో ఇంకా క్లారిటీ ఇవ్వలేదు మేకర్స్. వచ్చే ఏడాది సమ్మర్ లో రిలీజ్ అవుతుందని చెప్పుతున్నారు, కానీ దానిపై పెట్టిన పెట్టుబడికి వడ్డీలు పెరిగి బయ్యర్లకి నడ్డి విరిగిపోతోంది.

బయ్యర్లకు నష్టాల భయం…

ఏమన్నా గట్టిగా మాట్లాడితే ఎక్కడ ఇచ్చిన అడ్వాన్స్ తిరిగి అడుగుతారో అని ఎవరూ ఆ సినిమా నిర్మాతలని అడగటానికి ట్రై చేయడం లేదు. ఒకవేళ సర్దుకుని సినిమా రిలీజ్ అయ్యే దాకా వెయిట్ చేసినా అప్పుడు సినిమా టాక్ ఏమాత్రం అటు ఇటు అయినా ఆ నష్టాల నుండి బయర్స్ ని ఎవరు కాపాడలేరు. ఇలా బయ్యర్లు నష్టాలని దృష్టిలో పెట్టుకుని రజనీ వెంటనే కార్తీక్‌ సుబ్బరాజ్‌తో సినిమా తీస్తున్నాడు అని సమాచారం.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*