ఎన్టీఆర్ లో ఇప్పటివరకు కంఫర్మ్ అయిన పాత్రలు..!

ప్రస్తుతం అందరి కళ్లు ఎన్టీఆర్ బయోపిక్ మీదే ఉన్నాయి. ఎందుకంటే అందులో నటించే నటీనటులూ ఇందుకు ఒక కారణం. ఇప్పుటివరకు వివిధ పాత్రలకు కంఫర్మ్ అయినవారిలో… ఎన్టీఆర్ పాత్రలో బాలకృష్ణ, బసవతారకం పాత్రలో విద్యా బాలన్, చంద్రబాబు నాయుడు పాత్రలో రానా, అక్కినేని నాగేశ్వరరావు పాత్రలో సుమంత్, నాగిరెడ్డిగా ప్రకాష్ రాజ్, చక్రపాణిగా మురళి శర్మ, కెవి రెడ్డిగా క్రిష్, హెచ్ఎం రెడ్డిగా కైకాల సత్యనారాయణ, బిఎ సుబ్బారావుగా నరేష్ ఉన్నారు. చంద్రబాబు పాత్రలో నటించనున్న రానా తాజాగా ఆయనను కలిసి పాత్ర గురించి ముచ్చటించారు. క్రిష్, బాలకృష్ణ కూడా చంద్రబాబుతో సినిమా గురించి చర్చించిన సంగతి తెలిసిందే.

హరికృష్ణ పాత్రలో కళ్యాణ్ రామ్

వీరు కాకుండా శ్రీదేవి పాత్రకు తమన్నా లేదా రకుల్ ప్రీత్ సింగ్ అనుకుంటున్నారు. సావిత్రి పాత్రకు కీర్తి సురేష్ అనుకుంటున్నారు. కానీ వీరి నుండి ఇంకా గ్రీన్ సిగ్నల్ రాకపోవడంతో ఇంకా వీరు ఈ సినిమాలో పార్ట్ కాలేదు. మరోపక్క బాలకృష్ణ అన్నయ్య హరికృష్ణ పాత్రలో ఆయన కొడుకు కళ్యాణ్ రామ్ నటించబోతున్నాడు. ఈ వార్త ఎప్పటినుండో ప్రచారంలో ఉన్నప్పటికీ కొంత డౌట్ ఉండేది. ఇప్పుడు ఆల్మోస్ట్ క్లియర్ అయినట్టే. మరి ఎన్టీఆర్ యంగ్ ఏజ్ పాత్ర బాలయ్య కొడుకు మోక్షజ్ఞ చేస్తాడని ఎప్పటినుండో ప్రచారం జరుగుతుంది. అందుకు తగ్గ స్క్రీన్ టెస్ట్ జరుగుతోందని సమాచారం.

ముఖ్యమంత్రి అయ్యేవరకేనా..?

ఇక చిత్తూరు నాగయ్యగా విలన్ పాత్రలు వేసే రవి కిషన్ ను ఓకే చేసినట్టు తెలిసింది. అయితే ఇవే కాకుండా ఇంకా చాలా పాత్రల ఎంపిక జరగాల్సి ఉంది. దగ్గుబాటి వెంకటేశ్వర్ రావు, పురంధరేశ్వరి, నాదెండ్ల భాస్కర్ రావు, రాజీవ్ గాంధీ పాత్రలు కూడా ఉన్నాయట. కాకపోతే ఇవి చిన్న పాత్రలుగా చిత్రీకరించే అవకాశం ఉందంటున్నారు. కానీ రానా మీద మాత్రం సెకండ్ హాఫ్ లో చెప్పుకోదగ్గ సీన్లే ఉంటాయని తెలిసింది. మరి ఇన్ని పాత్రలు డీల్ ఎలా చేస్తాడో చూడాలి. ప్రధానంగా ఈ సినిమాలో ఎన్టీఆర్ జీవితం చివరి అంకాన్ని ఏ విధంగా చూపిస్తారనేది చర్చకి వచ్చింది. ఎటువంటి కాంట్రవర్సీ లేకుండా ఎన్టీఆర్‌ రాజకీయాల్లోకి ఎంటర్‌ అయి ముఖ్యమంత్రి అవడంతోనే కథ ముగించాలని బాలయ్య గట్టిగా పట్టుబట్టారని టాక్.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*