RRR లో హీరోయిన్ ని ఫిక్స్ చేసిన జక్కన్న..?

rajamouli sent karthikeya to convince bollywood star

దర్శక ధీరుడు రాజమౌళి ప్రస్తుతం ఎన్టీఆర్ – రామ్ చరణ్ మల్టీ స్టారర్ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ లో బిజీగా ఉన్నాడు. ఈ ఏడాది నవంబర్ నుండి ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ కానుంది. ముందుగా ఎన్టీఆర్ – చరణ్ లపై కాంబినేషన్ సీన్స్ ను షూట్ చేయనున్నాడు జక్కన్న. ప్రస్తుతం అందుకు సంబంధించి స్పెషల్ గా హైదరాబాద్ లో అల్యూమినియం ఫ్యాక్టరీ లో భారీగా సెట్ కూడా వేస్తున్నారు. ఆ సెట్ లో ఎన్టీఆర్, రామ్ చరణ్ లకు సంబంధించి షూట్ చేయనున్నారు. ఈ సినిమాకి హీరోలు అయితే కంఫర్మ్ అయ్యారు కానీ హీరోయిన్లు ఎవరన్నది ఇంకా క్లారిటీ రాలేదు. దాంతో ఈ ఇద్దరి హీరోల సరసన కథానాయికలుగా ఎవరు నటించనున్నారనే ఆసక్తి అభిమానుల్లో పెరుగుతూ వస్తోంది. ఫిలింనగర్ సమాచారం ప్రకారం ఒక హీరోయిన్ గా కీర్తి సురేష్ ను తీసుకోవాలి జక్కన్న భావిస్తున్నట్టు టాక్.

రెండో హీరోయిన్ ఎవరు..?

ఇటీవలే ‘మహానటి’ చూసిన రాజమౌళి… కీర్తి సురేశ్ నటనను ప్రశంసించిన సంగతి తెలిసిందే. అందులో ఆమె నటన నచ్చడంతో ఆమెను ఈ సినిమాలోకి తీసుకోవాలని నిర్ణయించుకున్నాడు. అయితే మరి ఎవరి జోడీగా అనేది కూడా ఆసక్తిని రేకెత్తించే విషయమే. ఎన్నో అంచనాలు మధ్య వస్తున్న ఈ చిత్రంలో రెండో హీరోయిన్ ఎవరనే విషయమూ కుతూహలాన్ని కలిగించే విషయమే.

Sandeep
About Sandeep 6180 Articles
Sandeep Reddy started his work in journalism at the age of 19 as a local reporter in leading telugu news paper. Later he worked as staff reporter. He has 9 years of experience in print and social media.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*