బడ్జెట్ తోనే అరిపించేశారు..!

#rrr movie update

ప్రస్తుతం టాలీవుడ్ లోనే కాదు.. అన్ని భాషల్లోనూ హాట్ టాపిక్ ఏమైనా ఉంది అంటే.. అది #RRR సినిమా గురించే. రాజమౌళి గత చిత్రం బాహుబలితో #RRRపై ట్రేడ్ లో, ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఏర్పడ్డాయి. టాలీవుడ్ నిర్మాత దానయ్య భారీ బడ్జెట్ తో #RRR సినిమాని ఎన్టీఆర్, రామ్ చరణ్ లతో రాజమౌళి దర్శకత్వంలో నిర్మిస్తున్నాడు. అయితే భారీ బడ్జెట్ అన్నారు కానీ #RRR బడ్జెట్ మీద ఇప్పటివరకు మీడియాకి క్లారిటీ లేదు. 200 నుండి 300 కోట్ల బడ్జెట్ తో #RRR నిర్మితమవుతుంది అని అన్నారు కానీ. స్పష్టత రాలేదు.

400 కోట్ల బడ్జెట్ తో..!

మరి నేషనల్ వైడ్ గా పలు భాషల్లో తెరక్కేకుతున్న #RRR బడ్జెట్ పై.. ఈ రోజు జరిగిన మీడియా సమావేశంలో ఒక స్పష్టత వచ్చేసింది. రాజమౌళి #RRR సినిమాని హై టెక్నికల్ వాల్యూస్ తో 350 కోట్ల నుండి 400కోట్లతో ఈ సినిమాను నిర్మిస్తున్నామని.. ఆ సినిమా నిర్మాత దానయ్య తెలియజేశాడు. ఇక ఈ సినిమాని అనేక భాషల్లో విడుదల చెయ్యాల్సిందిగా ఒత్తిడి ఉందని కానీ ప్రస్తుతం తెలుగు, తమిళ్, హిందీ, కన్నడ, మలయాళం ఇలా మొత్తం 10 బాషల్లోకి #RRR విడుదల చేసేందుకు నిర్ణయించామని రాజమౌళి ఈ ప్రెస్ మీట్ లో తెలిపాడు.

తెలుగులో మొదటిసారి…

మరి బహు భారీ బడ్జెట్ తో ఈ #RRR సినిమా తెరకెక్కుస్తున్నారు అనగానే ఎన్టీఆర్, మెగా ఫ్యాన్స్ అందరూ సంబరపడిపోతున్నారు. తమ అభిమాన హీరోలు ఈ భారీ సినిమాతో నేషనల్ వైడ్ గా ఫోకస్ అవుతారని వారు హ్యాపీ ఫీల్ అవుతున్నారు. మరి తెలుగులో ఈ రేంజ్ బడ్జెట్ తో ఇప్పటివరకు ఏ సినిమా కూడా తెరకెక్కలేదు. తెలుగులో ఇంత భారీ బడ్జెట్ తో తెరకెక్కబోతున్న మొదటి చిత్రం #RRR కావడం విశేషం.

Sandeep
About Sandeep 5651 Articles
Sandeep Reddy started his work in journalism at the age of 19 as a local reporter in leading telugu news paper. Later he worked as staff reporter. He has 9 years of experience in print and social media.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*