ఈసారి రాజమౌళి ఆమెని తీసుకొస్తాడా..?

rrr movie latest update

ఏ ముహూర్తాన #RRR ను స్టార్ట్ చేశారో కానీ అప్పటి నుండి ఈ సినిమాపై ఏదో ఒక న్యూస్ వైరల్ అవుతూనే ఉంది. ఈ నెల 19 నుండి రెగ్యులర్ షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాకు సంబంధించి హైదరాబాద్ పరిసరాల్లో అల్యూమినియం ఫ్యాక్టరీలో భారీ సెట్ వేశారు. ఇందులో ఇంటర్వెల్ సీన్ ని షూట్ చేయనున్నాడు జక్కన్న. దాదాపు 45 రోజులు పాటు జరిగే ఈ షెడ్యూల్ కోసం రాజమౌళి అక్కడే ఓ ఆఫీస్ ని నిర్మించుకుని అందులో నివాసం ఉండాలనుకుంటున్నాడట. అలానే రామ్ చరణ్, ఎన్టీఆర్ లని కూడా అక్కడే ఉండేటట్టు ఏర్పాట్లు చేస్తున్నాడట రాజమౌళి.

శ్రీదేవి కూతురిని పరిచయం చేయాలని…

అయితే ఇంతవరకు హీరోలను, ఇతర టెక్నీషియన్స్ ని తప్ప ఎవరినీ ఫైనల్ చేయలేదు రాజమౌళి. ఇందులో హీరోయిన్స్ గా రకుల్ ప్రీత్ సింగ్, సమంతలను అనుకున్నారు కానీ ఇప్పుడు నిర్ణయం ఎనక్కి తీసుకుని ఓ మాస్టర్ ప్లాన్ వేస్తున్నాడు జక్కన్న. శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ ని టాలీవుడ్ కి పరిచయం చేయాలన్న ఆలోచన రాజమౌళికి వచ్చిందట. రీసెంట్ గా తన మొదటి సినిమా `ధడక్`తో అదరగొట్టేసిన ఈమెను #RRR సినిమాతో టాలీవుడ్ కు పరిచయం చేస్తే అటు బాలీవుడ్ లోనూ ఈ ప్రాజెక్టుకి గ్లామర్ పెరుగుతుందని భావిస్తున్నారట. ఆల్రెడీ ఆమెను సంప్రదించారని తెలుస్తుంది. త్వరలోనే ఆఫిషియల్ కన్ఫర్మేషన్ రానుంది.

బాహుబలిలో శ్రీదేవిని తీసుకోవాలనుకున్నా…

నిజానికి ‘బాహుబలి’ లో శివగామి పాత్రలో మొదట శ్రీదేవినే అనుకున్నారు కానీ ఆమె భారీ రెమ్యూనరేషన్ చెప్పడంతో ఆమె ప్లేస్ లో రమ్యకృష్ణ ను తీసుకున్నారు. ఓ ఇంటర్వ్యూలో రాజమౌళి శ్రీదేవిపై చేసిన వ్యాఖ్య పెను దుమారమైంది. దాని వల్ల నేను చాలా బాధపడ్డానని శ్రీదేవి ఓ ఇంటర్వ్యూలో అన్నారు. ఆ తరువాత రాజమౌళి ఆలా అన్నందుకు చింతిస్తున్నానని రిగ్రెట్ ఫీలయ్యారు. కాబట్టి రాజమౌళికి ఇప్పుడు ఆమె రుణం తీర్చుకునేందుకు టైం వచ్చింది. ఆమె కూతురిని తన సినిమాలో పెట్టుకుని తెలుగు తెరకు పరిచయం చేయనున్నాడు. ఒకవేళ జాన్వీ నటిస్తే ఎవరి సరసన నటిస్తుందో తెలియాల్సి ఉంది. మరి #RRR లో చేయడానికి ఓకే చెబుతుందో లేదో చూడాలి.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*