’ఆర్ఎక్స్ 100′ హీరోయిన్ కు అవమానం..!

Payal Rajpoot Telugu news

కార్తికేయ హీరోగా పాయల్ రాజ్ పుత్ హీరోయిన్ గా తెరకెక్కిన చిత్రం ’ఆర్ఎక్స్ 100′ . అజయ్ భూపతి దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం మౌత్ టాక్ తో దూసుకుపోతుంది. హౌస్ ఫుల్ కలెక్షన్స్ తో బ్లాక్ బాస్టర్ విజయాన్ని సాధించింది. ఈ నేపథ్యంలో చిత్రం టీం విజయ యాత్రను చేపడుతుంది.

హీరోయిన్ ఫోటో మిస్సింగ్

ఈ సందర్భంగా ఈ చిత్రం పోస్టర్ సోషల్ మీడియా లో వైరల్ అవుతుంది. రొరింగ్ బ్లాక్ బ్లాస్టర్ పేరుతో విడుదలచేసిన ఈ పోస్టర్ లో ఈ చిత్రానికి పని చేసిన ముఖ్యమైన టెక్నిషియన్స్ తో పాటు హీరో, డైరెక్టర్, నిర్మాత ఫొటోలు కనిపించాయి కాని హీరోయిన్ పాయల్ ఫొటో లేదు.

కావాలనేనా…పొరపాటుతోనా…

దాంతో ప్రస్తుతం ఈ పోస్టర్ పై సోషల్ మీడియాలో విమర్శలు వెలుబడుతున్నాయి. ఈ చిత్రం హిట్ అవ్వటానికి ప్రధాన కారణం హీరోయిన్ అని ఒప్పుకోవాల్సిందే. కానీ అలాంటిది హీరోయిన్ ఫోటో ఆ పోస్టర్ లో లేకపోవడంతో ఆశ్చర్యానికి గురిచేస్తుంది. థియేటర్స్ కు యూత్ ని రప్పించడంలో పాయల్ ది కీలక పాత్ర అని తెలిసిందే. మరి ఈ పోస్టర్ లో హీరోయిన్ ఫోటో కావాలనే పెట్టలేదా.. లేదా పొరపాటున టీం మర్చిపోయిందా అన్న విషయం తెలియాల్సి వుంది.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*