రాజమౌళి ఇంత ఫాస్ట్ గా ఉన్నాడా?

rajamouli sent karthikeya to convince bollywood star

ఎన్టీఆర్ తో రామ్ చరణ్ తో కలిసి డివివి దానయ్య నిర్మాణంలో బడా మల్టీస్టారర్ సినిమా చెయ్యబోతున్నానంటూ ఒకే ఒక్క ఫొటోతో సెన్సేషన్ క్రియేట్ చేసిన రాజమౌళి.. అప్పటినుండి ఈ రోజు వరకు మళ్ళీ ఆ మల్టీస్టారర్ ముచ్చట్లు ఎక్కడైనా నోరు జారితే ఒట్టు. కానీ రాజమౌళి స్టార్ హీరోల కాంబోలో సినిమా ఉంటుందని ఎనౌన్స్ చేసాక.. మీడియాకి బాగా మేత దొరికింది. ఇక రాజమౌళి మల్టీస్టారర్ పై బోలెడన్ని వార్తలు సోషల్ మీడియాలో ప్రచారంలోకొచ్చాయి. ఆ సినిమా కథ ఇదని.. అదంటూ… ఎన్టీఆర్ విలన్ గా రామ్ చరణ్ హీరోగా ఇలా చాలానే వార్తలు ఫిలింనగర్ సాక్షిగా చక్కర్లు కొట్టాయి.

అయితే రాజమౌళి కామ్ గా ఉన్నప్పటికీ.. చరణ్, ఎన్టీఆర్ ల మల్టీస్టారర్ కోసం ఎప్పుడో రంగంలోకి దిగిపోయాడని.. ఇప్పటికే స్క్రిప్ట్ కూడా లాక్ చేసాడని.. రామ్ చరణ్ తో ఎన్టీఆర్ తో కలిసి, విడివిడిగా వర్క్ షాప్స్ కూడా నిర్వహించడని చెబుతున్నారు. అలాగే ఈ సినిమాని నవంబర్ 18 నుండి పూజా కార్యక్రమం తో మొదలు పెట్టి రెగ్యులర్ షూటింగ్ మొదలెడతారని నిన్నగాక మొన్న వచ్చిన న్యూస్. కానీ తాజాగా రాజమౌళి ఆలోచన మారినట్లుగా తెలుస్తుంది. నవంబర్ 18 కన్నా ముందే అంటే… న‌వంబ‌రు తొలి వారంలోనే రాజమౌళి మల్టీస్టారర్ సినిమాకి కొబ్బ‌రికాయ కొట్టేస్తార‌ని స‌మాచారం. ఇక ఈ సినిమాలో ఎన్టీఆర్, చరణ్ పక్కన ఇద్ద‌రు హీరోయిన్ల‌కు చోటుంది. అయితే వాళ్లిద్ద‌రు కాక‌… ఒక విదేశీ హీరోయిన్ కూడా ఇందులో న‌టిస్తుంద‌ని తెలుస్తోంది.

అయితే ప్రస్తుతం ఈ హీరోల కోసం హీరోయిన్స్ ని హడావిడిగా వెతికే పనిలేదట. ఎందుకంటే… #RRR మొదటి షెడ్యూల్ కేవలం ఎన్టీఆర్, చరణ్ ల మీదే ఉండబోతుంది. ఎన్టీఆర్‌, చ‌ర‌ణ్‌ల‌తో మొదటి షెడ్యూల్ కి సంబందించిన సన్నివేశాలు పూర్తి చేస్తార‌ని తెలుస్తోంది. ఆ తర్వాతే అంటే.. సెకండ్ షెడ్యూల్ లోనే హీరోయిన్లు రంగంలోకి దిగుతారని…. అందుకే రాజమౌళి హీరోయిన్ల ఎంపిక విష‌యంలో ఎలాంటి కంగారు ప‌డ‌డం లేదట. రెండో షెడ్యూల్‌కి ముందు హీరోయిన్స్ ఎంపిక చేసి…. అన్ని వివరాలు మీడియాకి తెలుపుతారని చెబుతున్నారు. మరి ఈ సినిమా కోసం స్టార్ హీరోలిద్దరు 200 రోజుల డేట్స్ కేటాయించారట. అలాగే రెమ్యునరేషన్ కింద లాభాల్లో వాటాలు కూడా అందుకోబోతున్నారనే టాక్ ఉంది

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*