సాహో కోసం నీళ్లలా ఖర్చు పెడుతున్నారట!!

భారీ బడ్జెట్ చిత్రం బాహుబలి తర్వాత ప్రభాస్ మరో భారీ ప్రాజెక్ట్ సాహో చిత్రంలో నటిస్తున్నాడు. సుజిత్ దర్శకత్వంలో యువి క్రియేషన్స్ సాహో చిత్రాన్ని 250 కోట్లతో నిర్మిస్తున్నారు. బాహుబలితో ప్రభాస్ క్రేజ్ ప్రపంచ వ్యాప్తంగా పెరిగిపోయింది. అందుకే సాహో నిర్మాతలు ప్రభాస్ ని నమ్ముకుని ఈచిత్రానికి భారీ గా పెట్టుబడి పెడుతున్నారు. ప్రభాస్ కెరీర్ లోనే భారీ ప్రాజెక్ట్ గా రూపుదిద్దుకుంటున్న ఈ సాహో చిత్రం హాలీవుడ్ స్టాండర్డ్ తో తెరకెక్కతోంది. ప్రస్తుతం దుబాయిలో అబుదాబిలో షూటింగ్ జరుపుకుంటున్న సాహో చిత్ర యాక్షన్ సన్నివేశాలను హాలీవుడ్ స్టెంట్ మాస్టర్ ఆధ్వర్యంలో 50 కోట్ల తో తెరకెక్కిస్తున్నారు.

యాక్షన్ సన్నివేశాల కోసం….

ఆ యాక్షన్ సన్నివేశాల కోసం ఖరీదైన బైకులు, కార్లు, బస్సులు లతో పాటుగా 250 మంది క్రూ సభ్యులను….. అత్యాధునిక టెక్నాలజీతో పనిచేసే ఏక్యూప్మెంట్స్ ను వినియోగిస్తున్నారట. అయితే యాక్షన్ సన్నివేశాలతో పాటుగా దుబాయ్ లోని కొన్ని లొకేషన్స్ లో సాహో కి సంబందించిన మరికొంత షూటింగ్ కూడా చిత్రీకరించబోతున్నారట అయితే ఆ సన్నివేశాలకు కూడా దాదాపుగా 30 కోట్ల ఖర్చు వుంటుందని… అక్కడ జరిగే మామూలు సన్నివేశాలకు, యాక్షన్ సన్నివేశాలకు కలిపి దాదాపుగా 90 కోట్ల ఖర్చు అవుతున్నట్టుగా చెబుతున్నారు. అంటే ఓవరాల్ గా దుబాయ్ షూటింగ్ కోసం సాహో నిర్మాతలు 90 కోట్లు వెచ్చిస్తున్నారన్నమాట.

ఎక్కడా తగ్గకుండా…..

మరి దుబాయ్ లో షూటింగ్ చేసుకునే సినిమాలకు అబుదాబి ఫిల్మ్ కమిషన్ తమ రూల్స్ ప్రకారం చిత్రీకరణకు 30 శాతం రాయితీని కూడా ఇస్తోంది. మరి కేవలం దుబాయ్ షూట్ కే 90 కోట్ల ఖర్చు సాహో కోసం నిర్మాతలు పెడుతున్నారు అంటే సాహో కోసం వారు ఎక్కడా తగ్గడం లేదనేది స్పష్టమవుతుంది. ఇక ఈ సినిమా లో నటించే నటీనటులు చాలామంది బాలీవుడ్ వారే కావడం కూడా వారికిచ్చే పారితోషకాలు కూడా గట్టిగానే ఉంటాయి. మరి సాహో నిర్మాతలకు ఈ సినిమా బడ్జెట్ 250 నుండి 300 కోట్ల వరకు పెరిగినా పెద్దగా ఆశ్చర్య పోనక్కర్లేదు. మరి ఈలెక్కన సాహో చిత్రం ఎలా లేదన్నా 500 కోట్లు కొల్లగొడితేనే సాహో నిర్మాతలకు గట్టిగా వర్కౌట్ అవుతుంది లేదంటే అంతే సంగతులు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*