యూరప్ సెట్ రెడీ అవుతుందా?

ప్రస్తుతం ప్రభాస్ నటిస్తున్న సాహో గురించిన ఏ విషయమైనా నిమిషాల్లో సెన్సేషన్ అవుతుంది. నిన్నటివరకు దుబాయ్ షెడ్యూల్ విషయంలో కథలు కథలుగా రాసిన మీడియా ఇప్పుడు ప్రభాస్ పెళ్లి విషయమై కథనాలు వండి వారుస్తుంది. ప్రభాస్ పెళ్లి విషయంలో ప్రభాస్ కి తొందరుందో లేదో తెలియదు గాని… మీడియా మాత్రం మాత్రం తెగ టెన్షన్ పడుతుంది. ప్రభాస్ తన ఫ్రెండ్ అనుష్క ని పెళ్లి చేసుకుంటాడా? ఆయన పెదనాన్న కృష్ణ రాజు గారు చూపించిన అమ్మాయిని పెళ్లి చేసుకుంటాడా? అనే పజిల్ గేమ్ ఆడుతుంది మీడియా. తాజాగా ప్రభాస్ పెళ్లిని హైలెట్ చేసిన మీడియా ప్రస్తుతం సాహో కి సంబందించిన మసాలాలు దట్టిస్తుంది.

75 కోట్లు ఖర్చు చేసి…..

దుబాయ్ లోనూ అబుదాబిలో సాహో సినిమాలో 8 నిమిషాల నిడివిగల కీలక సన్నివేశాలు కోసం దాదాపుగా 75 కోట్లు ఖర్చు పెట్టిన నిర్మతలు ఇపుడు సాహో కోసం హైదరాబాద్ లో వెయ్యబోయే యూరప్ సెట్ కోసం ఎంత ఖర్చు పెడతారో అనే హాట్ టాపిక్ ఫిలింసర్కిల్స్ లో ఘాటుగా వినిపిస్తుంది. సాహో సినిమా ఇటీవలే దుబాయ్ లో భారీ షెడ్యూల్ పూర్తీ చేసుకుని తదుపరి షెడ్యూల్ కోసం హైదరాబాద్ లో ల్యాండ్ అయ్యారు. సుజీత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ సినిమాకి సంబందించిన మరో షెడ్యూల్ ని యూరప్ లో చేయాలనీ ప్లాన్ చేశారట.

ఎడా పెడా ఖర్చు చేస్తూ…..

కానీ యూరప్ షెడ్యూల్ లో సాహో కి సంబంధించి కొన్ని సన్నివేశాలే ఉండడంతో యూరప్ లో చేయడం ఎందుకు .. అచ్చంగా అలాంటివి ఇక్కడే అంటే హైదరాబాద్ లోనే సెట్స్ వేస్తె బెటర్ అనే ఆలోచనలో ఉన్నారట నిర్మాతలు. యూరప్ లోని ట్రైన్ , షిప్.. హెలికాఫ్టర్ సన్నివేశాలకు ఇక్కడే భారీ సెట్ ను నిర్మిస్తారని టాక్ బయటికి వచ్చింది. మరి ఎన్ని సెట్స్ వేసి ఎంత ఖర్చు పెట్టినా… ప్రభాస్ కి బాహుబలితో వచ్చిన మార్కెట్ తో తొందరగానే పెట్టిన పెట్టుబడిని రాబట్టి… లాభాలు మూట గట్టుకోవచ్చని నిర్మతలు భావించబట్టే ఇలా డబ్బు ఎడా పెడా ఖర్చు పెట్టేస్తున్నారు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*