ప్రభాస్.. త్వరగా చెప్పు బాబూ..!

ప్రస్తుతం ప్రభాస్ నటిస్తున్న ‘సాహో’ చిత్రంపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. ఎప్పుడో స్టార్ట్ అయిన ఈ సినిమా ఎప్పుడో రిలీజ్ అవ్వాల్సి ఉంది కానీ ఇంతవరకు యాభై శాతం కూడా షూటింగ్ కంప్లీట్ చేసుకోలేదు. అయితే ఈ సినిమా రిలీజ్ డేట్ పై ఇంకా క్లారిటీ ఇవ్వట్లేదు. సమ్మర్ లో వస్తుంది అని తెలిసినప్పటికీ డేట్ ను ప్రకటించలేకపోతున్నారు మేకర్స్. కనీసం సమ్మర్ లో అయినా వస్తుందా? అంటే అదీ క్లారిటీ లేదు. ఆ టైంలో చిరంజీవి ‘సైరా’ రిలీజ్ అవ్వబోతుంది. ఏప్రిల్ మొదటివారంలో మహేష్ ‘మహర్షి’ రాబోతుంది. ఎంత లేదన్నా మూడు వారాలైనా దాని ప్రభావం ఉంటుంది. ఈ రెండు సినిమాలపై అంచనాలు ఉన్నాయి కాబట్టి రిలీజ్ విషయంలో కనీసం గ్యాప్ చాలా అవసరం.

క్లారిటీ ఇస్తేనే మంచిది..!

మూడు భాషల్లో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో టాకీ సీన్స్ మాత్రం పదే పదే తీస్తున్నారట. దానికి తోడు గ్రాఫిక్స్ వర్క్ కూడా ఎక్కువగా ఉండటంతో చాలా జాగ్రత్తగా తీస్తున్నారట. దాని వల్ల షూటింగ్ చాలా అవసరం అని అంటున్నారు. కానీ ముందుగానే రిలీజ్ డేట్ అనుకోకపోతే మరో చిక్కు ఉంది. ఇది హిందీ వెర్షన్ కూడా ఉంది కాబట్టి అక్కడ భారీ విడుదల ఏమున్నాయో చూసుకుని దానికి అనుగుణంగా ప్లాన్ చేయాలి. లేదంటే తేడాలొచ్చేస్తాయి. సో చాలా త్వరగా ప్రభాస్ అండ్ టీం ఈ చిత్రం రిలీజ్ డేట్ పై క్లారిటీ ఇస్తే మంచిది.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*