బాహుబలి షూటింగ్ లానే సాహూ కూడా ..!

రాజమౌళి తెరకెక్కించిన భారీ చిత్రం బాహుబలి షూటింగ్ మొత్తం హైదరాబాద్ లోని రామోజీ ఫిలిం సిటీలో జరిగింది. అక్కడ ఎన్నో ఎకరాలు తీసుకుని షూట్ చేశారు. దాంతో రాజమౌళితో పాటు ఏ ఒక్కరూ ఇంటికి వెళ్లే వారు కాదు. ఎందుకంటే కొన్ని సన్నివేశాల చిత్రీకరణ ఉదయం ప్రారంభిస్తే రాత్రి ఎప్పటికి పూర్తి అవుతుందో తెలియని పరిస్థితి. అందుకే అక్కడ ఫిలిం సిటీలో ఓ హోటల్ లో అంతా ఉండేవారు. వారితో పాటు ప్రభాస్ కూడా అక్కడే ఉండేవాడు.

త్వరగా పూర్తి చేయాలనే..!

డైరెక్టర్ సుజిత్ రూపొందిస్తున్న సాహూ చిత్రానికి కూడా అదే పరిస్థితి. ప్రస్తుతం ఈ సినిమా రామోజీ ఫిలిం సిటీలో శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. ఆదివారం ఒక్క రోజే నటీనటులు, సాంకేతిక నిపుణులు ఇంటికి వెళ్లి వస్తున్నారు మిగతా అన్ని రోజులు ఫిలిం సిటీలోనే ఉంటున్నారు. షూటింగ్ త్వరగా ఫినిష్ చేయాలని ఇప్పటికే చాలా లేట్ అయిందని అందుకే ఇంతలా కష్టపడుతున్నారని సమాచారం.

ప్రభాస్ కూడా అక్కడే..

జులై లో స్టార్ట్ చేసిన ఈ షెడ్యూల్ మరో వారం రోజుల్లో పూర్తి కానుంది. అప్పటి నుండి ప్రభాస్ ఫిలిం సిటీలోనే ఉంటున్నారట. రామోజీలో రాజవైభోగాలకు ఏమాత్రం తీసిపోని రీతిలో సమస్త సౌకర్యాలు వుంటాయి. సో అందరికీ బస అక్కడే ఏర్పాటు చేశారట. వీరితో పాటు ప్రభాస్ కూడా అక్కడే ఉంటున్నారు. ఇక హీరోయిన్ శ్రద్ధా కపూర్‌ మాత్రం మధ్య మధ్యలో వచ్చి వెళ్తున్నారు. ప్రస్తుతం ప్రభాస్ తదితరులపై పోరాట సన్నివేశాలను తెరకెక్కిస్తున్నారు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*