మాస్ కాదు బాబోయ్…. ఊర మాస్ పిల్ల

telugu post telugu news

ఫిదా చిత్రంలో తెలంగాణ పిల్లగా రచ్చచేసిన భానుమతి ఉరఫ్ సాయి పల్లవి తెలుగులో పెద్ద మొత్తంలోనే అభిమానులను సంపాదించుకుంది. ఫిదా తర్వాత ఎంసీఏ సినిమాలో నటించిన సాయి పల్లవి ఆ తర్వాత తమిళనాట కూడా కణం సినిమాలో నటించి హిట్ కొట్టింది. ఇక తెలుగు తమిళంలో సినిమాలు చేసుకుంటూ పోతున్న సాయి పల్లవి నటనకు చాలామంది అభిమానులే ఉన్నారు. చక్కటి నటన, చక్కటి డాన్స్ మొహంలో హావభావాలను పర్ఫెక్ట్ గా పలికించగల ఈ నటి అతి తక్కువ కాలంలోనే హీరోయిన్ గా పేరు సంపాదించింది.

తెలుగులో శర్వానంద్ సరసన క్లాస్ లుక్ లో పడి పడి లేచే మనసు సినిమాలో క్యూట్ క్యూట్ గా కనబడుతున్న సాయి పల్లవి తమిళనాట సూర్య సినిమాలోనూ, ధనుష్ సరసన మారి 2 లోను నటిస్తుంది. మరి ఈ దీపావళికి సాయి పల్లవి నటిస్తున్న సినిమాల లుక్స్ సోషల్ మీడియాలో వీర విహారం చేస్తున్నాయి. దీపావళికి ముందు పడి పడి లేచే మనసు లో శర్వానంద్ తో రొమాంటిక్ గా దర్శనమిచ్చిన సాయి పల్లవి దీపావళి తర్వాత మారి 2 లో ధనుష్ సరసన మాస్ పిల్లగా దర్శనమిచ్చింది. మాస్ కాదండోయ్ ఊర మాస్ లుక్ లో ఇరగదీసింది.

ఆటో డ్రైవర్ వేషంలో సాయి పల్లవి ఊర మాస్ స్టెప్స్ తో అదరగొట్టే ఫోజుల్లో రెచ్చిపోయింది. ధనుష్ తో రొమాంటిక్ లుక్ లోనే కాదు మాస్ లుక్స్ లోను సాయి పల్లవి అదరగొట్టింది. ధనుష్ తో కలిసి మాస్ స్టెప్స్ వేస్తూ ఆటో డ్రైవర్ లా జీన్స్ ప్యాంట్, ఖాకీ చొక్కాతో పిల్ల ఊర మాస్ గా రచ్చ చేసింది. మరి మీరు సాయి పల్లవి మాస్ లుక్ ని ఓ చూపు చూడండి.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*