సెకండ్ అనే పదం నచ్చకే రిజెక్ట్ చేసింది

తెలుగులో ఫిదా తో ఫిదా చేసిన ఫిదా పోరి సాయి పల్లవి పై బోలెడన్ని హాట్ న్యూస్ లు మీడియాలో హల్చల్ చేసాయి. ఆమెకి పొగరెక్కువని, సహా నటులను గౌరవించదని, అందరితో గొడవలు పడుతుందని, అలాగే కాస్త ఈగో పర్సెంట్ కూడా ఎక్కువనే న్యూస్ లు సాయి పల్లవి పై తరుచూ వినిపించడం, అలాగే.. ఆమెకి ఒక సినిమాలో తన పాత్ర నచ్చకపోతే కోట్లు కుమ్మరించినా సినిమా ఒప్పుకోదనే టాక్ ఉంది. అందుకే శ్రీనివాస కళ్యాణం సినిమా లో తన పాత్ర నచ్చకే సాయి పల్లవి ఆ సినిమాని రిజెక్ట్ చేసిందని.. దిల్ రాజు బ్రతిమాలినా ఆ అమ్మాయి ఒప్పుకోలేదన్నారు. ఇక ఆ ఆసినిమాకి రాశి ఖన్నా చెయ్యడం.. విడుదలవడం.. ప్లాప్ అవడం జరిగిపోయాయి.

అలాగే సాయి పల్లవి తాజాగా రెండు కోట్ల ఆఫర్ ని రిజెక్ట్ చేసిందనే న్యూస్ మీడియాలో నడిచింది. అది కూడా బెల్లంకొండ శ్రీనివాస్ సరసన చెయ్యనని సాయి పల్లవి ఆ ఆఫర్ ని వదిలేసిందని అన్నారు. అయితే బెల్లంకొండ కొత్త దర్శకుడి డైరెక్షన్ లో కాజల్ హీరోయిన్ గా సినిమా మొదలు పెట్టబోతున్నాడు. అయితే కాజల్ మెయిన్ కాగా.. రెండో హీరోయిన్ గా సాయి పల్లవి కోసం బెల్లంకొండ ట్రై చేసాడట. అందులోను మనోడు ఎప్పుడూ టాప్ హీరోయిన్స్ తో రొమాన్స్ చెయ్యడం అలవాటాయే. అందుకే ఒకేసారి కాజల్ తోనూ, సాయి పల్లవితోను రొమాన్స్ చెయ్యాలనుకున్నాడు.

మరి తన పాత్ర సెకండ్ హీరోయిన్ పాత్ర అనేసరికి సాయి పల్లవి ఆ అవకాశాన్ని వదులుకుంది. మరి ఇప్పుడు సాయి పల్లవి ప్లేస్ లోకి మెహ్రీన్ కౌర్ వచ్చి చేరింది. మెహెరీన్ కాస్త వెనకబడిన వచ్చిన అవకాశాన్ని ఒడిసి పట్టుకుంటుంది. మరి ఇప్పటివరకు సమంత, రకుల్ ప్రీత్ సింగ్, పూజ హెగ్డే వంటి హీరోయిన్స్ తో రొమాన్స్ చేసిన శ్రీనివాస్ ఇప్పుడు కాజల్ తో పాటుగా మెహ్రీన్ కౌర్ తో ఆడి పాడనుంది. సాయి పల్లవితో రామన్స్ చేద్దామనుకుంటే ఆమె నో చెప్పడంతో బెల్లంకొండ కాస్త డల్ అయినా అతనికి కాస్త ఫామ్ లో ఉన్న మెహ్రీన్ దొరికింది. మరి సాయి పల్లవికి 2 కోట్లు ఆఫర్ చేసిన బెల్లంకొండ ఇప్పుడు మెహ్రీన్ కి ఎంతటితో సరిపెడుతున్నాడో చూద్దాం

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*