ఆటో డ్రైవర్ గా ఫిదా బ్యూటీ!

టాలీవుడ్ లోనూ, కోలీవుడ్ లోనూ సాయిపల్లవి పేరు తెగ మార్మోగిపోతోంది. స్టార్ హీరోల సరసన నటించకపోయినా. సాయి పల్లవికి ఉన్న క్రేజ్ ముందు టాప్ హీరోయిన్స్ కూడా వెలవెలబోతున్నారు. అందం, అభినయం, నాట్యం ఇలా అన్ని విషయల్లోనూ ఒక మెట్టు పైనే ఉండే సాయి పల్లవి తో పని చెయ్యాలంటే కుర్ర హీరోలు జంకే పరిస్థితి. అయితే ఇప్పుడు తనకున్న క్రేజ్ కి ఎడాపెడా సినిమాలు ఒప్పుకోకుండా సాయి పల్లవి చాలా ఆచితూచి అడుగులు వేస్తోంది. కోలీవుడ్ లో సూర్య సరసన లీడ్ రోల్ లో నటిస్తున్న సాయిపల్లవి తెలుగులో శర్వా పక్కన పడి పడి లేచే మనసు లో నటిస్తుంది.

ఆటో కూడా నేర్చకుంది…

ఇక తనకి కథ, తన పాత్ర నచ్చితేనే సినిమాలు అంగీకరిస్తూ వస్తున్న సాయిపల్లవి ప్రస్తుతం కోలీవుడ్ హీరో ధనుష్ పక్కన నటించబోతుంది. తమిళంలో సాయి పల్లవి మారి 2 సినిమాలో ధనుష్ జోడీగా నటిస్తోంది. గతంలో ధనుష్ హీరోగా చేసిన మారి సినిమాకి మారి 2 సీక్వెల్. అయితే ఈ సినిమాలో సాయిపల్లవి ఆటో డ్రైవర్ పాత్ర చేయనుందట. మరి ఆటో డ్రైవర్ పాత్ర అంటే ఆటో నడపడం పర్ ఫెక్ట్ గా వచ్చి ఉండాలి. నటన మీదున్న డెడికేషన్ తో ఈ పాత్ర కోసం సాయిపల్లవి  ఆటో నడపడం నేర్చుకుందట. ఇక ఈ పాత్రతో ఆమె మాస్ ఆడియన్స్ నుంచి మరిన్ని మార్కులు కొట్టేయడం ఖాయమని అంటున్నారు.

టాలీవుడ్ లోనూ…

మరి ధనుష్ ప్రతి సినిమా కోలీవుడ్ తో పాటుగా టాలీవుడ్ లోనూ విడుదలవుతుంది. ఇక ఇప్పుడు ధనుష్ – సాయి పల్లవి జంటగా రాబోతున్న మారి 2 కూడా తెలుగులోనూ విడుదల చెయ్యలనుకున్నారట. మరి ఇప్పటి వరకు డాన్స్ లతో, నటనతో తెలుగు ప్రేక్షకులను ఫిదా చేసిన సాయి పల్లవి ఇప్పుడు ఆటో డ్రైవర్ గా ఎలా ఆకట్టుకుంటుదో మరి చూడాలి.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*