సైరా మ్యూజిక్ డైరెక్టర్ ఎవరో తెలుసా?

చిరంజీవి కెరీర్ లో ఎంతో గ్రాండ్ లెవెల్ లో తెరకెక్కుతున్న చిత్రం ‘సైరా’. ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది. ఈ సినిమా అనుకున్నప్పుడు సంగీతానికి రహ్మాన్ ని అనుకున్నారు. కానీ సినిమా స్టార్ట్ అయ్యాక ఏమైందో తెలియదు కానీ రహ్మాన్ ఈ క్రేజీ ప్రాజెక్ట్ నుండి తప్పుకున్నాడు. ఆ తర్వాత ఈమూవీకి సంగీత దర్శకుడు ఎవరో ప్రకటించలేదు. ఆ మధ్య బాలీవుడ్ సంగీత దర్శకుడు అమిత్ త్రివేదిని తీసుకున్నారనే వార్తలు వచ్చాయి. కానీ దానిపై యూనిట్ నుండి ఎటువంటి స్పందన లేదు.

అమిత్ త్రివేదీ……

ఎట్టకేలకు ఆ ప్రచారమే నిజమైంది. అమిత్ త్రివేది పేరును మేకర్స్ అఫీషియల్ గా ప్రకటించారు. ఈనెల 21న అంటే చిరంజీవి పుట్టిరోజు సందర్భంగా ‘సైరా’ ఫస్ట్ లుక్ టీజర్ ను రిలీజ్ చేస్తున్నట్టు మేకర్స్ ఎనౌన్స్ చేశారు. దానికి సంబంధించి ఓ ఆఫిషియల్ పోస్టర్ ను రిలీజ్ చేశారు. అందులో సంగీత దర్శకుడు అమిత్ త్రివేది పేరు ఉంది. సో దాంతో ఈ వార్తపై ఓ క్లారిటీ వచ్చింది.

ట్రాక్ రికార్డు అదుర్స్……

బాలీవుడ్ లో ఎనో సూపర్ హిట్ చిత్రాలకు సంగీతం అందించాడు అమిత్ త్రివేది. అతని ట్రాక్ రికార్డే అమిత్ కు ‘సైరా’ అవకాశం దక్కేలా చేసింది. ‘సైరా’ మోషన్ టీజర్ కు బ్యాక్ గ్రౌండ్ స్కోర్ తమన్ తో కొట్టించారు. ఇక ఈ సినిమాను తమన్ కంఫర్మ్ అనుకున్నారు అంతే…. కానీ అప్పుడు తమన్ ప్లేస్ లో కీరవాణి పేరు వచ్చింది. ఏమైందో ఏమో తెలియదు కానీ చివరికి పోస్టర్ లో అమిత్ త్రివేది వచ్చింది. ఇక సినిమా రిలీజ్ డేట్ ఎప్పుడో ఇప్పటివరకు క్లారిటీ ఇవ్వలేదు మేకర్స్. బహుశా 21న రిలీజ్ చేసే టీజర్ లో ప్రకటిస్తారేమో చూద్దాం.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*