సాక్ష్యం సాహసమేనా..!

బెల్లంకొండ శ్రీనివాస్ తన కెరీర్ లో మూడు సినిమాలు చేయగా ఆ మూడు సినిమాలు భారీగా తెరకేక్కించిన చిత్రాలే. అందులో రెండు సినిమాలు అయితే ఏకంగా 30 కోట్ల పైమాటే. హిట్స్, ఫ్లాప్స్ తో సంబంధం లేకుండా తనపై భారీ లెవెల్ లో ఇన్వెస్ట్ చేసి సినిమాలు తీసేందుకు మేకర్స్ ఏ మాత్రం వెనక్కు తగ్గడంలేదు. అయితే ఆలానే శ్రీనివాస్ నటించిన ‘సాక్ష్యం’ సినిమా ఈ నెల 27న రిలీజ్ కాబోతుంది.

భారీ ధరలకు హక్కులు…

ఈ సినిమా ఏకంగా 40 కోట్లు బిజినెస్ చేసిందని టాక్. ట్రేడ్ లెక్కలు ప్రకారం.. నైజాంకు 7 కోట్లు.. సీడెడ్ కు 5 కోట్లు..ఆంధ్ర మొత్తం కలిపి 15 కోట్లకు అభిషేక్ సంస్థ అమ్మేసిందనే వార్తలు వస్తున్నాయి. శాటిలైట్ ప్లస్ డిజిటల్ మీద ఇప్పటికే 10 కోట్ల దాకా వచ్చేసాయి. ఓ ఫాంటసీ కథ ఇంతలా బిజినెస్ జరగడం… శ్రీనివాస్ పై ఇంత పెట్టడం అంటే మాములు విషయం కాదు.

సినిమా టాక్ పైనే ఆధారం…

పూజా హెగ్డే గ్లామర్, మసాలా దట్టించిన గ్రాఫిక్ సన్నివేశాలు, సినిమా టేకింగ్ ఏమన్నా ప్లస్ అయితే అవ్వొచ్చు. ‘సాక్ష్యం’ హిట్ అందుకోవాలంటే…కేవలం షేర్ మాత్రమే 30 కోట్లు అయినా రావాలి. ఓపెనింగ్స్ బాగా వస్తాయి కానీ అంత షేర్ కలెక్ట్ చేయలేదు ఈ సినిమా. దానికి తోడు మొదటి రోజు వచ్చే టాక్ ని బట్టే జాతకం ఆధారపడి ఉంటుంది. కంటెంట్ మీద ఫుల్ కాంఫిడెన్స్ గా ఉన్నా ఏమైనా తేడా జరిగితే అంతే సంగతులు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*