సాక్ష్యం సినిమాకు ఏమైంది…!

బెల్లంకొండ శ్రీనివాస్ – పూజ హెగ్డే జంటగా శ్రీవాస్ దర్శకుడిగా తెరకెక్కిన సాక్ష్యం సినిమా ఈ రోజు శుక్రవారం ప్రేక్షకుల ముందుకు రావాల్సి ఉంది. భారీ అంచనాలు, భారీ క్రేజ్ మధ్యన ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సాక్ష్యం సినిమా మార్నింగ్ షోస్ క్యాన్సిల్ అయ్యాయి. లేదంటే ఈపాటికి ఐమాక్స్ వంటి మల్టిప్లెక్స్ లో సాక్ష్యం బొమ్మ పడడమే కాదు… సినిమా లైవ్ అప్ డేట్స్ కూడా వచ్చేసుండేవి. కానీ సాక్ష్యం సినిమా షోస్ క్యాన్సిల్ అవడం వలన సాక్ష్యం సినిమా కోసం టికెట్స్ బుక్ చేసుకున్న వారు ఉసూరుమంటూ.. థియేటర్స్ కి వచ్చి మరీ వెనుదిరిపోతున్నారు.

స్టోరీ లైన్ ఆసక్తికరంగా…..

అయితే సాక్ష్యం సినిమా విడుదలకు ఫైనాన్స్ ఇష్యుస్ ఏవో ఉన్నాయనే టాక్ అయితే వినబడుతుంది. మరి బెల్లంకొండ సురేష్ వంటి నిర్మాత కొడుకు సినిమాకే ఇలాంటి పరిస్థితి వస్తే మాములు హీరోల పరిస్థితి ఏమిటో కదా. ఇక పంచభూతాల సాక్షిగా అంటూ నిప్పు, నీరు, గాలి, వంటి అంశాలతో ఆసక్తికరంగా ఉన్న సాక్ష్యం స్టోరీ లైన్ సినిమా మీద అందరిలో ఆసక్తి ఏర్పడేలా చేసింది. మరి ఇప్పడు ఎంతో ఆసక్తికరంగా సినిమా కోసం ఎదురు చూస్తున్న ప్రేక్షకులకు సినిమా షోస్ క్యాన్సిల్ అయినా.. ఈవెనింగ్ షోస్ కల్లా సాక్ష్యం ప్రేక్షకుల ముందుకు వచ్చేస్తుందంటున్నారు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*