నాలుగు రోజుల్లో 40 కోట్లు సాధ్యమేనా..?

బెల్లంకొండ సురేష్ తనయుడు బెల్లంకొండ శ్రీనివాస్ నాలుగో చిత్రం సాక్ష్యం సినిమాకి యావరేజ్ టాక్ వచ్చింది. భారీ అంటే 40 కోట్ల బడ్జెట్ తో శ్రీవాస్ దర్శకత్వంలో టాప్ హీరోయిన్ పూజ హెగ్డే హీరోయిన్ గా తెరకెక్కిన ఈ సినిమాకి పెట్టిన పెట్టుబడి రావడం కష్టమంటూ గత మూడు రోజులుగా సోషల్ మీడియాలో ఒక రేంజ్ లో ప్రచారం జరిగింది. పంచభూతాల నేపథ్యంలో నడిపించిన ఈ కథకి క్రిటిక్స్ తో పాటు ప్రేక్షకుల నెమ్మదిగా కనెక్ట్ అవుతున్నారంటున్నారు. మరి మొదటి రోజు ప్రపంచవ్యాప్తంగా 3.5 కోట్లు తెచ్చుకున్న ఈ సినిమా ఫస్ట్ వీకెండ్ లో 8 కోట్లు రాబట్టింది.

22 ఓకే.. మరి 40 కోట్లు ఎలా…?

అయితే మొదటి మూడు రోజుల్లో ఈ సినిమా 8 కోట్లు కొల్లగొట్టింది. అలాగే హిందీ రైట్స్ కి, శాటిలైట్స్ హక్కులకు కలిపి సాక్ష్యం సినిమాకి హోల్సేల్ గా 13 కోట్లు వచ్చాయి. మరి మొదటి మూడు రోజులలో కలిసి ఈ శాటిలైట్స్, హిందీ హక్కులు కలిపి సుమారు 22 కోట్లు కొల్లగొట్టినట్టు అయ్యింది. మరి ఇదంతా ఓపెన్ గా చాలా వెబ్ సైట్స్, సోషల్ మీడియా, ప్రింట్ మీడియాలో వచ్చిన బహిరంగ వార్తలే. కానీ తాజాగా సాక్ష్యం సినిమా నాలుగు రోజుల్లోనే 40 కోట్లు కొల్లగొట్టిందంటూ ఒక న్యూస్ ఫిలిం సర్కిల్స్ తో పాటు సోషల్ మీడియాలోనూ హల్చల్ చేస్తుంది.

ఆశ్చర్యపోతున్న క్రిటిక్స్…

దీనికి కారణాన్ని కూడా వల్లేస్తున్నారు. అదేమిటంటే హీరోయిన్ పూజ హెగ్డే క్రేజ్ ఈ సినిమా వసూళ్లు పెరగడానికి కారణమని.. అలాగే శ్రీవాస్ కథని నడిపించిన తీరు అద్భుతమని… అంతేకాకుండా బెల్లంకొండ శ్రీనివాస్ నటన సినిమాకే హైలెట్ అంటూ.. ఇంకా అభిషేక్ పిక్చర్స్ వారు ఎక్కడా ఆలోచించకుండా పెట్టిన నిర్మాణ ఖర్చులు అన్ని కలిపి ఈ సినిమాకి హిట్ కలెక్షన్స్ తెచ్చాయంటూ చెబుతున్నారు. మరి అసలు నాలుగు రోజుల్లో 40 కోట్ల షేర్ రాబట్టడం మామూలు విషయం కాదు. కానీ ఇప్పుడు సాక్ష్యం సినిమాకి 40 కోట్లు వచ్చాయని చెప్పడంతో ప్రేక్షకులే కాదు కొంతమంది క్రిటిక్స్ కూడా నోరెళ్లబెడుతున్నారు. సినిమాలో విషయం లేనప్పుడు అదెలా సాధ్యమంటూ ముసిముసిగా నవ్వుకుంటున్నారు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*