సెంటిమెంట్ మళ్లీ తుస్సుమంది!

గత కొన్నేళ్లుగా ప్రతి రంజాన్ సీజన్ కి సల్మాన్ సినిమా ఉండటం కామన్ అయిపోయింది. దాదాపు ప్రతి రంజాన్ కి వచ్చి హిట్ కొట్టాడు సల్మాన్ ఖాన్. 8 ఏళ్లుగా వస్తున్న ఈ హిట్ సెంటిమెంట్ ను గతేడాది ట్యూబ్ లైట్ బ్రేక్ చేసింది. గత ఏడాది రంజాన్ లో ఈ సినిమా వచ్చి ఫ్లాప్ అయింది. మళ్లీ ఆ తర్వాత లేటెస్ట్ గా రేస్-3 కూడా ఆ ట్యూబ్ లైట్ లిస్ట్ లో అంటే ఫ్లాప్ లిస్ట్ లో చేరింది. రంజాన్ కానుకగా వచ్చినా ఈ సినిమా ఆడియన్స్ ను మేప్పించలేకపోవడంతో ఫ్లాప్ అయింది.

సల్మాన్ వన్ మెన్ షో…

సల్మాన్ క్రేజ్ తో రేస్3 కి మొదటి మూడు రోజులు కలెక్షన్స్ కు ఢోకా లేదు. కానీ ఆ తర్వాత పరిస్థితే కొంచం దారుణంగా ఉండే అవకాశం ఉంది. రేస్ సిరీస్ అంటే ట్విస్టులు.. యాక్షన్ సీన్స్..రొమాంటిక్ సాంగ్స్ ఇలా ఎక్స్ పెక్ట్ చేసి థియేటర్స్ వస్తుంటారు ప్రేక్షకులు. కానీ ఇందులో సల్మాన్ షో తప్ప ఇంకోటి లేదు అని ప్రేక్షకులే పెదవి విరుస్తున్నారు. రెమో డిసౌజా తెరకెక్కించిన ఈ సినిమా కన్నా… రేస్, రేస్-2 సినిమాల్ని టీవీల్లో మరోసారి చూడటం బెటరని అంటున్నారు చాలామంది.

మరీ ట్యూబ్ లైట్ అంతకాదు గానీ…

దాంతో రంజాన్ సీజన్ లో వరసగా రెండో ఫ్లాప్ అందుకున్నాడు సల్మాన్ ఖాన్. పోయిన ఏడాది వచ్చిన ట్యూబ్ లైట్ సినిమాతో నష్టపోయిన బయ్యర్లను స్వయంగా సల్మాన్ ఆదుకున్నాడు. కాకపోతే ఈ సినిమా ట్యూబ్ లైట్ అంత వరస్ట్ గా లేదని చెబుతున్నారు. కొంచం చెప్పుకోదగ్గ కలెక్షన్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయ్ అని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి.