జంటగా సినిమా ఏమోగాని… యాడ్స్ తో కొడుతున్నారు!

ప్రస్తుతం టాలీవుడ్ లో క్యుటెస్ట్ కపుల్ ఎవరు అంటే… నాగ చైతన్య – సమంత జంటని చూపిస్తారు. ఐదేళ్లుగా ప్రేమించుకున్న ఈ జంట గత ఏడాది పెళ్లితో ఒక్కటైంది. అక్కినేని ఇంటి కోడలిగా అడుగుపెట్టిన సమంత ఇప్పటికీ గ్లామరస్ హీరోయిన్ గా సినిమా ల్లో అలరిస్తూనే ఉంది. పెళ్లి తర్వాత హిట్ మీద హిట్ కొడుతున్న సమంత తాజా చిత్రం యూ టర్న్ విడుదలకు సిద్దమవుతుంది. ఇక నాగ చైతన్య సవ్యసాచి, శైలజ రెడ్డి సినిమాలతో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధంగా ఉన్నాడు. అయితే నాగ చైతన్య – సమంత లు పెళ్ళికి ముందు కలిసి మూడు సినిమాలు చేశారు. అయితే అప్పటికున్న క్రేజ్ కంటే.. ఇప్పుడు పెళ్లి తర్వాత వారు కలిసి నటిస్తే వచ్చే క్రేజ్ వేరు. అందుకే వీరిని జంటగా చాలామంది తమ సినిమాల్లో నటింపజేయాలని అనుకున్నారు.

యాడ్స్ తో బిజీగా మారిన జంట

చివరికి ఈ జంట శివ నిర్వాణ చేతికి చిక్కింది. శివ నిర్వాణ దర్శకత్వంలో చైతు – సామ్ జంట భార్యభర్తలుగా నటిస్తున్నారు. అయితే ఆ సినిమా ఇంకా సెట్స్ మీదకి వెళ్ళకముందే వీరిద్దరి జంట యాడ్స్ తో ప్రేక్షకులను పడేస్తున్నారు. మొన్నటికి మొన్న నాగ చైతన్య – సమంత లు బిగ్ బజార్ కోసం రకరాల యాడ్స్ లో భార్య భర్తలుగా ఆ షాప్ ని ప్రమోషన్స్ తో అదరగొట్టారు. ఇక ఇపుడు సమంత – నాగ చైతన్య లు ఒక సోప్ యాడ్ లో ఇరగదీస్తున్నారు. రెక్సోనా సోప్ యాడ్ లో ఈ భార్య భర్తలు అదరగొడుతున్నారు. మరి భార్య భర్తల మధ్య కెమిస్ట్రీ ఎలా ఉంటుందో ఈ యాడ్ లో రియాల్ గా చూశామనే ఫీలింగ్ కలుగుతుంది.

ఆ సినిమాపై అంచనాలు పెంచేస్తున్నారు…

మరి నిజమైన భార్య భర్తలు ఆఫ్ స్క్రీన్ మీద ఎలా వుంటారో.. ఆన్ స్క్రీన్ మీద అలానే ఉంటె.. నిజంగానే చూడడానికి చాలా బావుంటుంది. ఇక ఈ యాడ్ లో నాగ చైతన్య – సమంత ల మధ్యన రొమాంటిక్, కెమిస్ట్రీ మాత్రం అదుర్స్ అనే రేంజ్ లో ఉన్నాయంటే నమ్మాలి. అందుకే పెళ్ళయాక నటించబోయే శివ నిర్వాణ సినిమాపై అప్పుడే ఆకాశాన్నంటే అంచనాలు ఉన్నాయి. మరి ఈ చైతు – సామ్ జంట మాత్రం ఇటు సినిమాల్లోను అటు యాడ్స్ లోను ఎక్కడా తగ్గేలా కనబడడం లేదు.