ఐబిజా పబ్ లో టాలీవుడ్ కపుల్ హగ్..!

nag on naga chaitanya samantha

టాలీవుడ్ క్యూట్ కపుల్ అయిన నాగ చైతన్య – సమంత పెళ్లి చేసుకుని అక్టోబర్ 6కి ఏడాది కావొస్తుంది. ప్రస్తుతం ఈ జంట సినిమా షూటింగ్ లకు గ్యాప్ ఇచ్చేసి మరీ వెకేషన్ కి చెక్కేసింది. స్పెయిన్‌లో ఓ టాప్ ఐలాండ్‌ అయిన ఐబిజాలో తేలిపోయారు. అక్కడ ఎంజాయ్ చేస్తున్న ఈ క్యూట్ కపుల్ తో పాటు అక్కినేని అఖిల్, సమంత ఫ్రెండ్ నీరజ కోన, ఇంకొంతమంది ఫ్రెండ్స్ కూడా ఈ ట్రిప్ లో ఉన్నట్లుగా చెబుతున్నారు. ఇక అక్కడ ఐబిజా మ్యూజిక్ ఫెస్టివల్స్ గట్రా చూసుకుని నెలాఖరుకి లేదా అక్టోబర్ తొలివారంలో ఇండియాకి రానున్నారు. ప్రస్తుతం నాగ చైతన్య – సమంత సోమవారం రాత్రి ఐబిజా పబ్ లో ఎంజాయ్ చేస్తూ గాఢమైన హాగ్ చేసుకొని ముద్దు కూడా పెట్టేసుకున్నారు. ప్రస్తుతం ఈ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.

Sandeep
About Sandeep 6914 Articles
Sandeep Reddy started his work in journalism at the age of 19 as a local reporter in leading telugu news paper. Later he worked as staff reporter. He has 9 years of experience in print and social media.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*