సమంత క్రేజ్ తో అమ్మేశారా..?

ప్రస్తుతం టాలీవుడ్, కోలీవుడ్ లో పెళ్లయినా సమంత జోరు ఏ మాత్రం తగ్గడం లేదు. సినిమాల మీద సినిమాల్లో నటించడమే కాదు.. ఆ సినిమాలు సూపర్ హిట్ అవడంతో.. సమంత కెరీర్ ని అద్భుతంగా ప్లాన్ చేసుకుంటుంది. ఈ ఏడాది రంగస్థలం, మహానటి, అభిమన్యుడు తో హిట్స్ కొట్టిన సమంత మళ్లీ సెప్టెంబర్ 13న తానెంతో ఇష్టపడి నటించిన యు-టర్న్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ప్రస్తుతం టాప్ రేంజ్ హిట్స్ తో దూసుకుపోతున్న సమంత యు-టర్న్ మీద మంచి అంచనాలే ఉన్నాయి. కన్నడంలో సూపర్ హిట్ కొట్టిన ఈ సినిమాని సమంత ఎంతో పట్టుబట్టి తెలుగులో రీమేక్ చేసింది.

ప్రీ రిలీజ్ బిజినెస్ బాగుందడటంతో…

ఈ సినిమా కేవలం పది కోట్ల పెట్టుబడితోనే తెరకెక్కింది. మరి ఈ సినిమా కన్నడంలో హిట్ అయినా.. సినిమాలోని లోపాలను వెతుక్కుని మరీ తెలుగులో వాటిని లేకుండా కొత్త సీన్స్ తో తెరకెక్కించినట్లుగా తెలుస్తుంది. జర్నలిస్ట్ గా కనబడనున్న సమంతా ఈ సినిమాతో కూడా హిట్ కొట్టడం ఖాయమని.. యు-టర్న్ ఫస్ట్ లూక్లోనే తెలుస్తుంది. ఇక 10 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ బాగానే జరిగింది. ప్రస్తుతం నిర్మాతలు సమంతకు ఉన్న క్రేజ్ తో టేబుల్ ప్రాఫిట్ తో యు-టర్న్ బిజినెస్ క్లోజ్ చేసినట్లుగా తెలుస్తుంది. ఆంధ్ర – నైజాం రెండు ఏరియాలను కలిపి సురేష్ రెడ్డి అనే డిస్ట్రిబ్యూటర్ 6 కోట్లకి యు-టర్న్ హక్కులను సొంతం చేసుకున్నాడు.

సెప్టెంబర్ 13న విడుదల

అలాగే సీడెడ్ హక్కులను కూడా దాదాపుగా కోటి రూపాయలకు అమ్మేసినట్లుగా తెలుస్తుంది. మరి టోటల్ గా ఏపీ, టీఎస్ హక్కులను అమ్మేశారు. ఇంకా మిగిలిన ఓవర్సీస్, శాటిలైట్, డిజిటల్ హక్కుల వివరాలు మాత్రం తెలియాల్సి ఉంది. ఇక సమంత భర్త నాగ చైతన్య నటించిన శైలజ రెడ్డి అల్లుడు ఈ నెల 31న విడుదల కావాల్సి ఉండగా… కేరళ వరదల కారణంగా ఆ సినిమా విడుదల వాయిదా పడింది. అయితే శైలజ రెడ్డి అల్లుడు సినిమా వాయిదా పడడంతో సమంత యు-టర్న్ కూడా వాయిదా పడే సూచనలు ఉన్నాయనుకున్నారు కానీ.. యు- టర్న్ యధావిధిగా సెప్టెంబర్ 13 నే విడుదలవుతుందని మేకర్స్ క్లారిటీ ఇచ్చారు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*