సమంతకు టైం దొరకడంతో..!

సమంత ఏ ముహూర్తాన అక్కినేని వారింటి కోడలు అయిందో అప్పటి ఆమె సుడి మాములుగా తిరిగిపోలేదు. పెళ్లైన తర్వాత హీరోయిన్స్ సినీ ఇండస్ట్రీ లో నెట్టుకుని రావడం కష్టం అని చెప్పినవారంతా ముక్కు మీద వేలు వేసుకునేలా చేసింది సామ్. పెళ్లి తర్వాత చేసిన సినిమాలు అన్నీ సూపర్ హిట్ గా నిలిచాయి. అంతేకాదు సామ్ కు ఈ ఏడాది ఎంతో ప్రత్యేకం. ఆమె నటించిన ‘రంగస్థలం’, ‘మహానటి’, ‘యూ-టర్న్’, ‘ఇరుంబుదురై’ (తెలుగులో అభిమన్యుడు) చిత్రాలు సూపర్ హిట్ అవ్వడమే కాదు బాక్స్ ఆఫీస్ వద్ద భారీ కలెక్షన్లను కొల్లగొట్టాయి.

విహారయాత్రలో చై-సామ్

ఇక లేటెస్ట్ గా వచ్చిన ‘యూ-టర్న్’ సినిమాకి కూడా మంచి రెస్పాన్స్ వస్తుంది. ఈ సంవత్సరంలో ఎక్కడ గ్యాప్ లేకుండా వరసగా సినిమాలు చేసిన సామ్ విశ్రాంతి కోసం తన భర్త నాగ చైతన్యతో కలిసి విహారయాత్రకు వెళ్లిపోయింది. ఈ విషయాన్ని తన సోషల్ మీడియా అకౌంట్స్ లో పోస్ట్ చేసి ‘ఫైనల్లీ వెకేషన్’ కాప్షన్ పెట్టింది. కొన్ని ఫొటోస్ కూడా తన ఇన్ స్టాగ్రామ్ అకౌంట్ లో షేర్ చేసింది.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*